newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

షియోమీ మరో సంచలనం

08-12-201808-12-2018 18:55:39 IST
Updated On 08-12-2018 18:55:37 ISTUpdated On 08-12-20182018-12-08T13:25:39.782Z08-12-2018 2018-12-08T13:25:37.382Z - 2018-12-08T13:25:37.384Z - 08-12-2018

షియోమీ మరో సంచలనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షియోమీ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇతర మొబైల్ కంపెనీలో ఆధిపత్యం చెలాయించేందుకు... అద్భుతమైన ఫీచర్స్‌తో కూడిన ఫోన్లను తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకువస్తోంది. ఏదైనా ఓ సంస్థ గొప్ప ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్ విడుదల చేస్తే చాలు... ఆ వెంటనే దానికి పోటీగా అంతకుమించిన ఫోన్‌ను మార్కెట్‌లోకి తెస్తోంది షియోమీ! ఇందులో భాగంగానే హువాయికి పోటీగా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు ఈ సంస్థ సన్నద్ధమవుతోంది. హువాయి సంస్థ ఇప్పటికే 40 మెగాపిక్సెల్ కెమెరా గల స్మార్ట్‌ఫోన్‌ని రిలీజ్ చేయగా... దానికి ధీటుగా ఏకంగా 48 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్‌ని షియోమీ విడుదల చేయనుంది.

ఈ విషయాన్ని సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ... కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అందుకు సంబంధించి ఒక సంకేతం ఇచ్చాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో షేర్ చేసి, ఈ న్యూస్‌ని అనధికారికంగా విడుదల చేశాడు. ఆయన లీక్ చేసిన ఇమేజ్ దృష్ట్యా... ఈ ఫోన్ 48 ఎంపీ Sony's IMX586 సెన్సార్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ప్రతి పిక్సల్ సైజు 0.8umగా ఉండనుంది. ఫోటోగ్రఫీ అభిమానుల కోసం కొన్ని ప్రత్యేక ఫీచర్లను యాడ్ చేసే అవకాశం ఉంది. లైటింగ్ అంతగా లేని చోట కూడా ఫోటోలు అందంగా వచ్చేలా దీన్ని తీర్చిదిద్దనున్నట్లు సమాచారం! ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఓ కుదుపు కుదిపేస్తున్న షియోమీ నుంచి ఈ ఫోన్ విడుదల అయితే... ఖచ్చితంగా సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు!

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle