షియోమీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ ఫోన్లలో వాయిస్ వైఫై కాలింగ్
14-01-202014-01-2020 17:56:01 IST
Updated On 14-01-2020 17:56:15 ISTUpdated On 14-01-20202020-01-14T12:26:01.050Z14-01-2020 2020-01-14T12:25:59.527Z - 2020-01-14T12:26:15.867Z - 14-01-2020

వినియోగదారులు కాల్ ఛార్జీల గురించి ఆందోళన పడకుండా జియో, ఎయిర్ టెల్ కంపెనీలు వైఫై కాలింగ్ అంటూ శుభవార్త అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా కంపెనీ షియోమీ తన స్మార్ట్ఫోన్ వినియోగదారులకు బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నట్టు ప్రకటించింది. తమ కంపెనీకి చెందిన వివిధ మోడళ్ళకు వైఫై కాలింగ్ సదుపాయాన్ని కల్పించింది. వాయిస్ వైఫై కాలింగ్ సేవలు ఇక మీదట తమ స్మార్ట్ఫోన్లలో వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈమేరకు ఫోన్ల జాబితాను వెల్లడించింది. రెడ్ మీ వై3, రెడ్ మీ కె 20, రెడ్ కె20 ప్రొ, రెడ్ మీ నోట్ 7 ప్రొ, రెడ్ మీ నోట్ 8 ప్రొ, రెడ్ మీ 7, రెడ్ మీ 7ఎ మోడల్స్ ద్వారా వాయిస్ వైఫై కాలింగ్ సదుపాయం పొందవచ్చు. భారతి ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా వై ఫై కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించింది. దీని ద్వారా తమ వైఫై చందాదారుల సంఖ్య 10 లక్షలు దాటిందని ప్రకటించింది. ఎయిర్ టెల్ పోటీని సీరియస్ గా తీసుకున్న రిలయన్స్ జియో కూడా ఈ సదుపాయాన్ని కొన్ని పరిమిత సర్కిళ్లలో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంచనుంది. ఈ సేవలకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో వినియోగదారులు ఈసేవలకు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. వీఓ వైఫై టెక్నాలజీతో పబ్లిక్ హాట్స్పాట్ లేదా ప్రైవేట్ హోం వైఫై నెట్వర్క్కు కనెక్ట్ చేసుకొని ఏ మొబైల్ఫోన్కైనా, ల్యాండ్లైన్కైనా కాల్స్ చేసుకునే సదుపాయం ఉంది.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
6 hours ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా