షియోమితో పెట్టుకుంటే ‘మడతడిపోద్ది’
08-01-201908-01-2019 18:29:39 IST
2019-01-08T12:59:39.380Z08-01-2019 2019-01-08T12:04:36.232Z - - 10-04-2021

మొబైల్స్ రంగంలో షియోమి సంచలనాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. తాము విడుదల చేస్తున్న ప్రతి మోడల్‌కూ జనాల నుంచి విపరీతమైన ఆదరణ వస్తుండడంతో ఈ సంస్థ దూసుకుపోతోంది. మార్కెట్లో తామే ముందుండాలన్న లక్ష్యంతో... అతి తక్కువ ధరలకే అధునాతన ఫీచర్స్ గల స్మార్ట్‌ఫోన్స్‌ని వరుసగా రంగంలోకి దించుతోంది. ఒక సంస్థ కొంచెం కొత్తగా ఏదైనా ప్రయోగం చేస్తోందన్న విషయం తెలిస్తే చాలు... ఆ వెంటనే షియోమి అంతకుమించిన ఫోన్‌ను విడుదల చేసేందుకు రెడీ అయిపోతోంది. తాజాగా ఈ సంస్థ ‘ఫోల్డబుల్ ఫోన్’ను రిలీజ్ చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే శాంసంగ్, హువాయి కంపెనీలో ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. భారీ స్ర్కీన్స్ గల ఈ ఫోన్స్‌ని మడతపెడితే... ఇరువైపులా స్ర్కీన్స్ వాడుకునే విధంగా ఆ రెండు సంస్థలు తయారుచేశాయి. అయితే... షియోమి ఈ కంపెనీల కంటే మరో అడుగు ముందుకేసింది. ఫోల్డ్ చేస్తే... 3 స్ర్కీన్స్ వచ్చేలా అమర్చింది. అంటే... ఇరువైపులా మడతపెట్టగా, మధ్యలో ఒక స్ర్కీన్స్, వెనుక భాగంగా రెండు స్ర్కీన్స్ అటాచ్ అయ్యేలా సరికొత్త ఫోన్‌ని తయారు చేసింది. ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తే... ల్యాప్‌టాప్‌లు పూర్తిగా కనుమరుగవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పుడున్న స్మార్ట్ఫోన్లు చిన్నచిన్న స్ర్కీన్స్ కలిగి ఉండడం వల్ల ల్యాప్‌టాప్‌ల హవా ఇంకా కొనసాగుతోందని... ఈ ఫోల్డబుల్ ఫోన్ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోతుందని అంటున్నారు. ఈ ఫోన్లలో ఎక్కువ స్ర్కీన్స్ ఉండడం, చిన్న సైజు ఫోన్లాగే మడతపెట్టి జేబులో పెట్టుకునే సౌకర్యమూ ఉంది కాబట్టి... ల్యాప్‌టాప్‌లపై వాటి ప్రభావం ఖచ్చితంగా పడుతుందంటున్నారు.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
3 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా