షావోమీ 4K టీవీ వచ్చేసింది... ఫీచర్లు చూశారా?
29-11-201929-11-2019 18:23:31 IST
2019-11-29T12:53:31.226Z29-11-2019 2019-11-29T11:18:51.892Z - - 17-04-2021

ఎంఐ టీవీ 4ఎక్స్ పేరుతో ఇటీవల షావోమీ కొన్ని టీవీలను లాంచ్ చేసింది. అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులో ధరలో వాటిని తీసుకొచ్చింది. ఇప్పుడు వాటికి కొన్ని మార్పులు చేసి 2020 ఎడిషన్‌ను లాంచ్ చేసింది. గతంలో 4 ఎక్స్ 43 ఇంచ్, 50 ఇంచ్, 65 ఇంచ్ ఎంఐ టీవీ మోడళ్లను లాంచ్ చేసింది. ఇప్పుడు 55 ఇంచ్ మోడల్‌ను తీసుకొచ్చింది. ఎంఐ టీవీ 4ఎక్స్ పేరుతో డిసెంబరు 2న ఈ టీవీని సేల్‌కి తీసుకొస్తున్నారు.
ఎంఐ టీవీ 4ఎక్స్ - 2020 ఎడిషన్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ నేటివ్ సపోర్టు ఉంటుంది. దీని వల్ల థర్డ్ పార్టీ సోర్సెస్ అవసరం లేకుండానే అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వాడుకోవచ్చు. టీవీతోపాటు ఇచ్చే ఎంఐ రిమోట్ కంట్రోలర్‌లో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ కోసం ప్రత్యేకంగా బటన్స్ ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ లేటెస్ట్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.
ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా పని చేసే ప్యాచ్‌వాల్ 2.0 ను బిల్ట్ ఇన్‌గా ఇస్తున్నారు. దీని ద్వారా 4K నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్‌లోని కంటెంట్‌ను చూడొచ్చు. క్రోమ్ కాస్ట్, యూట్యూబ్, గూగుల్ అసిస్టెంట్ ఇందులో ఉంటాయి. దీంతోపాటు షావోమీ ఇందులో డేటా సేవర్ మోడ్‌ను తీసుకొస్తున్నారు.
ఎంఐ టీవీ 4ఎక్స్‌లో 2020లో ఎప్పటిలాగే 20 వాట్ స్టీరియో స్పీకర్ ఉంటుంది. 4K 10 బిట్ హెచ్డీఆర్ డిస్ప్లే ఇస్తున్నారు. ఇది షావోమీ వివిడ్ పిక్చర్ ఇంజిన్ ఆధారంగా పని చేస్తుంది. ఇందులో డాల్బీ అట్మాస్ ఆడియో సిస్టమ్ ఉంటుంది. దీని ధర రూ.34,999. జనవరి 31, 2020 కంటే ముందు ఈ టీవీ కొనుగోలు చేసినవారికి తక్కువ ధరకు ఎయిర్ టెల్ డీటీహెచ్ కనక్షన్ ఇస్తున్నారు. రూ. 3,450 బదులు రూ.1,800 ధరకే నాలుగు నెలల సబ్‌స్క్రిప్షన్‌తో డీటీహెచ్ కనక్షన్ ఇస్తున్నారు. అమెజాన్, ఎం.కామ్, ఎం హోమ్‌లో ఎంఐ టీవీ 4ఎక్స్‌ను కొనుగోలు చేయొచ్చు.



గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా