షావోమీ 3 in 1 లైట్ వచ్చిందట.. చూశారా?
04-12-201904-12-2019 09:03:38 IST
2019-12-04T03:33:38.956Z04-12-2019 2019-12-04T03:33:35.734Z - - 14-04-2021

కొత్త కొత్త గ్యాడ్జెట్లను తీసుకురావడంలో షావోమీ లెక్కేవేరు. ఇటీవల ఎఫ్ఎం రేడియో ఉన్న పవర్ బ్యాంకును తీసుకొచ్చింది. అంతకుముందు స్మార్ట్ ఫిష్ ట్యాంక్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు త్రీ ఇన్ వన్ ఫ్లాష్ లైట్‌ను తీసుకొచ్చింది. పేరు చూస్తేనే అర్థమవుతోంది కదా. ఇది మూడు రకాలుగా పని చేస్తుంది. దీన్ని ఫ్లాష్ లైట్‌గా (టార్చ్ లైట్) వాడుకోవచ్చు. ఇందులో బ్యాటరీ సాయంతో మీ గ్యాడ్జెట్స్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే ఇది పవర్ బ్యాంకుగానూ పని చేస్తుంది. ఇది కాకుండా మామూలు ల్యాంప్‌ను పని చేస్తుంది. ఇంకా ఇందులో ఫీచర్లు అయితే భలే ఉన్నాయ్. అవేంటో చూసేయండి...
చైనా మార్కెట్లో షావోమీ నాటో మల్టీ ఫంక్షన్ ఇండక్షన్ లైట్ పేరుతో ఓ డివైజ్‌ను లాంచ్ చేసింది. దీనిని మూడు రకాలుగా వాడుకోవచ్చు. దీన్ని లైట్గాను, ఫ్లాష్లైట్గాను, పవర్ బ్యాంకుగాను వినియోగించుకోవచ్చు. ఇందులో 2600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దాంతో మీ గ్యాడ్జెట్స్, డివైజ్‌లను ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. చైనా ధరను మనకు కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే దీని ధర రూ.1200 మాత్రమే.

ఈ త్రీ ఇన్ వన్ ల్యాంప్‌లో డ్యూయల్ ఫొటో సెన్సర్ ఉంటుంది. ఈ డివైజ్‌ను ల్యాంప్‌గా వాడినప్పుడు ఫొటో సెన్సర్ యాక్టివ్ అవుతుంది. లైట్ చుట్టూ ఉన్న లైటింగ్‌ను బట్టి దాని వెలుతురు బట్టి ల్యాంప్ లైట్ అడ్జస్ట్ అవుతుంది. అంటే గదిలో వెలుతురు ఎక్కువగా ఉంటే ల్యాంప్ కాస్త డిమ్ అవుతుంది. అదే గదిలో చీకటి ఉంటే ల్యాంప్ మరింత ప్రకాశవంతంగా మారుతుంది. అలాగే ఈ లైట్ దగ్గరకు ఎవరైనా వస్తే సెన్సర్ గమనించి లైట్‌ను ఆన్ చేస్తుంది. దూరంగా జరిగితే లైట్ తిరిగి ఆగిపోతుంది. కాబట్టి ప్రతిసారి ఆన్, ఆఫ్ చేసుకోనక్కర్లేదు.

ఈ సెన్సర్ 120 డిగ్రీల ఫీల్డ్ వ్యూ ఉంటుంది. మూడు మీటర్ల దూరంలో ఉన్న మనుషుల్ని సైతం సెన్సర్ పసిగడుతుంది. దీని గోడకు పెట్టుకునే మౌంటెడ్ ల్యాంప్గానూ, టేబుల్ ల్యాంప్గానూ వాడుకోవచ్చు. లేదంటే ఫ్లాష్‌లైట్ (టార్చ్ లైట్) గానూ వినియోగించుకోవచ్చు. మామూలు టార్చ్‌గా కనిపించే దీనిని హోల్డర్‌లో పెడితే ల్యాంప్ అవుతుంది. ఇక ముందుగా చెప్పుకున్నట్లుగా పవర్ బ్యాంకుగానూ పని చేస్తుంది. చైనాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ డివైజ్‌ను షావోమీ ఎప్పుడు మన దేశానికి తెస్తుందో చూడాలి.





గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా