షావోమీ స్మార్ట్ వాచ్... సూపర్ స్మార్ట్
05-11-201905-11-2019 16:33:46 IST
Updated On 05-11-2019 16:35:08 ISTUpdated On 05-11-20192019-11-05T11:03:46.178Z05-11-2019 2019-11-05T11:03:43.445Z - 2019-11-05T11:05:08.396Z - 05-11-2019

స్మార్ట్ వాచీల విభాగంలోకి షావోమీ చాలా కాలం క్రితమే వచ్చింది. అయితే అవేవీ షావోమీ బ్రాండ్‌తో ఉండవు. సబ్ బ్రాండ్ల నుంచే ఆ వాచీలు వచ్చాయి. కానీ తొలిసారి షావోమీ సొంత బ్రాండ్ మీద స్మార్ట్ వాచీని లాంచ్ చేస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు అంతర్జాలంలో సందడి చేస్తున్నాయి. షావోమీ అఫీషియల్ వాటిని విడుదల చేసింది. వాటి ప్రకారం ఈ వాచీ ఎంత సూపర్ స్మార్ట్‌గా ఉండబతోందో తెలుసస్తోంది. ఆపిల్ మొబైళ్ల తరహాలో స్టెయిన్లెస్ స్టీల్ డిజైన్‌లో తీసుకురాబోతున్నారు. ఈ రోజు చైనాలో వీటిని లాంచ్ చేయబోతున్నారు.
స్టెయిన్లెస్ స్టీల్ డిజైన్‌తోపాటు డిజిటల్ క్రౌన్ ఉండేలా షావోమీ స్మార్ట్ వాచీని రూపొందించింది. స్క్రీన్‌ను షాపైర్ గ్లాస్‌తో ప్రొటక్ట్ చేస్తున్నారు. దీంతోపాటు ఈ వాచీ స్క్రాన్ రెసిస్టెన్స్‌గా ఉండబోతోంది. అంటే అంత త్వరగా గీతలు పడే అవకాశం లేదు. ఈ వాచీ నేవిగేషన్‌కు కూడా సపోర్టు చేస్తుందని షావోమీ చెబుతోంది. అంతేకాదు ఈ వాచీతో కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఇతర స్మార్ట్ డివైజ్‌లను కూడా ఈ వాచీని కంట్రోల్ చేయొచ్చని తెలుస్తోంది. అంటే యాపిల్ వాచీతో చేసే చాలా పనులు షావోమీ వాచీతో చేయొచ్చన్నమాట.

షావోమీ స్మార్ట్ వాచీలో డైనమిక్ వాల్‌పేపర్స్ ఉండబోతున్నాయి. రౌండెండ్ ఎడ్జ్, స్వ్కేర్ డిజైన్‌లో ఈ వాచీని రూపొందించారు. షావోమీ షేర్ చేసిన ఫొటోల బట్టి చూస్తే బ్లాక్ స్ట్రాప్‌తో ఈ వాచీలు రాబోతున్నాయి. అయితే గతంలో వచ్చిన ఫొటోల బట్టి చూస్తే నీలం, ఎరుపు రంగుల్లో కూడా వాచీలు ఉండబోతున్నాయి. ఈ వాచీ గూగుల్ వాచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఇందులో క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ వేర్ 3100 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇందులో వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్సీ లాంటి ఫీచర్లు కూడా ఉంటాయి.




గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా