షావోమీ వాటర్ ప్యూరిఫయర్ గురించి తెలుసా?
13-09-201913-09-2019 09:42:43 IST
Updated On 13-09-2019 09:42:37 ISTUpdated On 13-09-20192019-09-13T04:12:43.134Z13-09-2019 2019-09-13T04:07:07.417Z - 2019-09-13T04:12:37.501Z - 13-09-2019

మొబైళ్లతో భారత్‌లోకి ప్రవేశించి... టీవీలతో మార్కెట్‌ను ఓ కుదుపు కుదిపేసింది షావోమీ. ఆ తర్వాత అడపాదడపా కొన్ని రకాల ప్రాడెక్టులను తీసుకొస్తోంది. బ్యాక్‌ప్యాక్‌లు, ట్రిమ్మర్లు, టేబుల్ లైట్లు అంటూ రకరకాల వస్తువులను తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ వరుసలో మరో కొత్త ప్రాడెక్టు రాబోతోంది. అదే వాటర్ ప్యూరిఫయర్. అవును నీళ్లను శుద్ధి చేసి ఇచ్చే మినీ యంత్రాన్ని షావోమీ మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ ప్యూరిఫయర్ వినూత్నంగా ఉంటుంది.
స్మార్టర్ లివింగ్ - 2020 పేరుతో షావోమీ ఈ నెల 17న ఓ ఈవెంట్ నిర్వహిస్తోంది. అందులో 65 అంగుళాల టీవీ, ఎంఐ బ్యాండ్ 4తోపాటు ఈ వాటర్ ప్యూరిఫయర్‌ను కూడా విడుదల చేస్తారని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్లను mi.com వెబ్సైట్లో పెట్టారు. అయితే ఎక్కడా ఏ ప్యూరిఫయర్ అనేది చెప్పలేదు. ఇప్పటికే టీడీఎస్ టెస్టర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు వచ్చేది ప్యూరిఫయరే అని తెలుస్తోంది.
ఎంఐ ప్యూరిఫయర్ రివర్స్ ఆస్మోసిస్ సాంకేతికత ఆధారంగా పని చేస్తుంది. ఇందులో నాలుగు అంచెల ప్యూరిఫికేషన్ ఉంటుంది. పీపీ కాటన్ ఫిల్టర్, యాక్టివేటడ్ కార్బర్ ప్రి ఫిల్టర్, ఆర్ఓ ఫిల్టర్, యాక్టివేటడ్ కార్బర్ ఫిల్టర్ అని నాలుగు రకాలు ఈ ప్యూరిఫయర్‌లో ఉంటాయి. దీనిని వైఫైకి కనెక్ట్ చేసి... మొబైల్ యాప్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. నీటి నాణ్యత ఎలా ఉంది తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.



ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
11 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా