షావోమీ ఫిట్నెస్ బ్యాండ్లో మైక్ వస్తోంది!
06-10-201906-10-2019 20:09:46 IST
2019-10-06T14:39:46.296Z06-10-2019 2019-10-06T14:39:16.119Z - - 17-04-2021

యువత మస్ట్ గ్యాడ్జెట్ల జాబితాలో ఇప్పుడు ఫిట్నెస్ బ్యాండ్ కూడా వచ్చి చేరింది. ఇటీవల కాలంలో కుర్రాకారును చూస్తుంటే ఒక చేతిలో మొబైల్, మరో చేతికి ఫిట్నెస్ బ్యాండ్ కనిపిస్తోంది. అందుకే గ్యాడ్జెట్ కంపెనీలు ఈ వైపు ఆలోచిస్తున్నాయి. బడ్జెట్ బ్యాండ్ల విభాగంలో చైనాకు చెందిన షావోమీ, హానర్ ఈ వ్యాపారంలో ముందున్నాయని చెప్పొచ్చు. ఇటీవల హానర్ నుంచి బ్యాండ్ 5, షావోమీ నుంచి బ్యాండ్ 4 వచ్చాయి. ఇప్పుడు షావోమీ బ్యాండ్ 5 తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఈ బ్యాండ్ గతంలో కంటే మరింత ఆసక్తికరంగా ఉండబోతోందని తెలుస్తోంది. షావోమీ ఎంఐ బ్యాండ్ 4 చైనా వెర్షన్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన ఫీచర్లు ఇతర దేశాల్లో విడుదలైన వెర్షన్ లో లేవు. ముఖ్యంగా ఎన్ఎఫ్సి, మైక్రోఫోన్ ఫీచర్లను షావోమీ చైనాకు మాత్రమే పరిమితం చేసింది. అయితే ఎంఐ బ్యాండ్ 5తో ఆ ఫీచర్ల ను కూడా ఇతర దేశాల మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తోంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం కొత్త ఎంఐ బ్యాండ్లో ఈ రెండు కీలకమైన ఫీచర్లు కచ్చితంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు కొత్త బ్యాండ్... గత వెర్షన్లతో పోలిస్తే మరింత దృఢంగా, అధునాతన ఫీచర్లతో రాబోతోందట. ఎంఐ బ్యాండ్ 5 ఎప్పుడు విడుదలయ్యేదనే విషయంలో షావోమీ ఎలాంటి సమచారం ఇవ్వలేదు. సాధారణంగా షావోమీ ఏటా మే, జూన్లో కొత్త బ్యాండ్లు విడుదల చేస్తుంటుంది. ఆ లెక్కన బ్యాండ్ 5 కూడా వచ్చ ఏడాది ప్రథమార్ధం ఆఖరులో లాంచ్ అవ్వొచ్చు. మన దేశంలో సెప్టెంబరు - అక్టోబరు మధ్యలో అందుబాటులో రావొచ్చు. దీని ధర సుమారు ₹2500 వరకు ఉండొచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల భారత మార్కెట్ లోకి విడుదలైన బ్యాండ్ 4కు మంచి ఆదరణ లభిస్తోందని షావోమీ వర్గాలు చెబుతున్నాయి. ₹2,299 ధరతో వచ్చిన ఈ బ్యాండ్ తొలిసారి రంగుల స్క్రీన్ తో రూపొందింది. బ్యాండ్ 5 లో కూడా ఇలానే రంగుల స్క్రీన్ ఉంటుంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా