newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

షావోమీ ‘పోకో 2’ని తీసుకొస్తోందా... ఏమో ఈ ఫొటో అలానే అనిపిస్తోంది!

30-09-201930-09-2019 17:23:22 IST
2019-09-30T11:53:22.492Z30-09-2019 2019-09-30T11:53:19.263Z - - 23-04-2021

షావోమీ ‘పోకో 2’ని తీసుకొస్తోందా... ఏమో ఈ ఫొటో అలానే అనిపిస్తోంది!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఫ్లాగ్‌ షిప్‌ స్పెసికేషన్లతో బడ్జెట్‌ ధరలో మొబైల్‌ అనగానే రెండేళ్లుగా గుర్తొస్తున్న ‘పోకో ఎఫ్‌ 1’. బెస్ట్‌ కెమెరా, సూపర్‌ఫాస్ట్‌ ప్రాసెసర్‌, మెరుగైన పనితనంతో పోకో ఎఫ్‌ 1 యూజర్లను ఆకట్టుకుంది. చాలా టెక్‌ మ్యాగజైన్లు, యూట్యూబ్‌ ఛానళ్లు పోకో ఎఫ్‌ 1 ‘మొబైల్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ప్రకటించాయి కూడా. అయితే ఈ మొబైల్‌ సక్సెసర్‌ గా ‘పోకో ఎఫ్‌ 2’ వస్తుందని చాలా రోజులు వార్తలు వచ్చాయి.

‘రెడ్‌మి కె20’ సిరీస్‌ మొబైళ్లు వస్తున్నప్పుడు ఈ వార్తలు ఎక్కువగా వినిపించాయి. రెడ్‌మి కె20 భారత్‌లో పోకో ఎఫ్‌ 2గా వస్తుందని భావించారు. కానీ అనుకున్నది జరగలేదు. దీంతో పోకో ఎఫ్‌ 2 ఇంక రానట్లే అనుకున్నారు. కానీ ఇప్పడు మళ్లీ ‘పోకో ఎఫ్‌ 2’ మాట మళ్లీ వినిపిస్తోంది.

ట్విటర్‌లో కొన్నాళ్ల క్రితం ‘పోకో ఎఫ్‌ 2’ ట్రెండింగ్‌లోకి వచ్చింది కూడా. ఆ తర్వాత ఎలాంటి చడీచప్పుడు లేదు. ఇప్పుడు మళ్లీ ట్విటర్‌లో ట్రెండింగ్‌ మొదలైంది. కారణం షావోమీ ఆన్‌లైన్‌ పార్టనర్‌ సేల్స్‌ హెడ్‌ మన్మోహన్‌ చేసిన ఓ ట్వీటే. ఇటీవల ఆయన చేసిన ఓ ట్వీటులో ఆన్‌లైన్‌ ఆఫర్ల గురించి ప్రస్తావిస్తూ ‘పోకో ఎఫ్‌ 2’ ఎప్పుడు వస్తుందంటారు అని అభిమాని అడిగినట్లు రాసుకొచ్చారు.

అంతేకాదు దానికి అతని సమాధానం అంటూ ఓ గిఫ్‌ను షేర్‌ చేశారు. ఇంకా ఆలోచిస్తున్నట్లు, అర్థం కానట్లు ఆ గిఫ్‌లో చూపించారు. దీనికి షావోమీ గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మను కుమార్‌ జైన్‌ కూడా స్పందించాడు. అనుకోకుండా మన్మోహన్‌ పోకో ఎఫ్‌ 2 గురించి ప్రస్తావించారు అని చెప్పారు. దీంతోపాటు రెడ్‌మి బిజినెస్‌ లీడబ్‌ స్నేహా టనియావాలా తో మాట్లాడుతున్న ఫొటో షేర్‌ చేశారు. 

మనుకుమార్‌ జైన్‌ షేర్‌ చేసిన ఫొటోలో కొత్త మొబైల్స్‌ ఎప్పుడు తీసుకొస్తారనే విషయం తెలిపే ఓ బోర్డు ఉంది. కాబట్టి ఈ చర్చ  పోకో ఎఫ్‌ 2 గురించే అనేది ట్విటర్‌ పుకార్లు. ఆ బోర్డు మీద చూస్తే ఎంఐ ప్యాడ్‌ మే లేదా జూన్‌లో తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు రాసి ఉంది. పోకో ఎఫ్‌ 2 అయితే ఆఖరి క్వార్టర్‌ దిగువ రాసి ఉంది. దీని బట్టి చూస్తే అక్టోబరు, నవంబరు, డిసెంబరులో రావొచ్చని అర్థమవుతుంది. అంటే పోకో ఎఫ్‌ 2ను చూడాలంటే మరో ఏడాది ఆగాల్సిందే. 

 

 

 

 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   21 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle