newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

షావోమీ నోట్‌బుక్‌ ప్రో లాంచ్‌ అయ్యింది... మనకెప్పుడో మరి!

23-10-201923-10-2019 17:35:49 IST
Updated On 24-10-2019 17:28:53 ISTUpdated On 24-10-20192019-10-23T12:05:49.579Z23-10-2019 2019-10-23T12:05:46.833Z - 2019-10-24T11:58:53.324Z - 24-10-2019

 షావోమీ నోట్‌బుక్‌ ప్రో లాంచ్‌ అయ్యింది... మనకెప్పుడో మరి!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత మార్కెట్‌లోకి షావోమీ మొబైళ్లు, ఐఓటీ గ్యాడ్జెట్లు, టీవీలు, లైఫ్‌స్టైల్‌ ప్రోడక్ట్‌లను తీసుకొస్తోంది కానీ ల్యాప్‌టాప్‌ల విషయంలో మాత్రం ఎందుకో ఆసక్తి చూపడం లేదు. వాటికి ఇక్కడ అంత మార్కెట్‌ ఉండదు అనుకుంటుందో... లేక ఇంకేదైనా కారణం ఉందేమో కానీ.. ఇక్కడకు షావోమీ ల్యాపీలు రావడం లేదు. ఈ విషయం పక్కనపెడితే చైనాలో మరో షావోమీ ల్యాప్‌టాప్‌ లాంచ్‌ అయ్యింది. ‘ఎంఐ నోట్‌బుక్‌ ప్రో 15 ఎన్‌హ్యాన్సడ్‌ ఎడిషన్‌’ పేరుతో ఓ ల్యాపీని లాంచ్‌ చేశారు. ఇందులో పదో జనరేషన్‌ ప్రాసెసర్‌ను వినియోగించారు. వచ్చే నెల 1 నుంచి చైనాలో దీనిని సేల్‌కి తీసుకొస్తున్నారు. ఎప్పటిలాగే ఈ ల్యాపీ భారత్‌ ఎప్పుడొస్తుందనే విషయం క్లారిటీ లేదు.

ఈ ఏడాది మొదట్లో లాంచ్‌ అయిన ‘ఎంఐ నోట్‌ బుక్‌ ప్రో (2019)’కి సక్సెసర్‌గా ‘ఎంఐ నోట్‌బుక్‌ ప్రో 15 ఎన్‌హ్యాన్స్‌డ్‌ ఎడిషన్‌’ ను లాంచ్‌ చేశారు. ఇందులో వేడిని నియంత్రించడానికి డ్యూయల్‌ ఫ్యాన్‌ సిస్టమ్‌ను వాడుతున్నారు. 1080 ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది.

1 టీబీ స్టోరేజీని అందిస్తున్నారు. విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఇందులో పదో జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ7 ప్రాసెసర్‌ ఉంటుంది. 16 జీబీ ర్యామ్‌, ఎన్‌విడియా జిఫోర్స్‌ ఎంఎక్స్‌250 జీపీయూ ఉంటాయి. చైనాలో దీని ధర సుమారు 6,999 యువాన్లు, అంటే మన కరెన్సీలో సుమారు ₹70,100. 

మెటల్‌ బాడీతో రూపొందిన ఈ ల్యాపీలో డార్క్‌ గ్రే ఫినిష్‌ ఉంటుంది. ఎంఐ నోట్‌ బుక్‌ ప్రో 15 ఎన్‌హ్యాన్స్‌డ్‌ ఎడిషన్‌’లో 60డబ్ల్యూహెచ్‌ బ్యాటీ ఉంటుంది. ఫుల్‌ సైజ్‌ బ్యాక్‌లిట్‌ కీబోర్డు ఇస్తున్నారు. 19.5 ఎంఎం లార్జ్‌ కీస్‌ ఉంటాయి.

ఒక హెచ్‌డీఎంఐ, ఒక యూఎస్‌బీ సీ పోర్ట్‌, 3.5 ఎంఎం ఆడియో జాక్‌ ఇస్తున్నారు. వీడియో కాల్స్‌ కోసం 1 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. దీంతో 720పి వీడియో కాల్స్‌ చేసుకోవచ్చు. దీని బరువు రెండు కిలోల వరకు ఉంటుంది. 16.9 ఎంఎం థిక్‌నెస్‌ ఉంటుంది.

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle