షావోమీ డిస్ప్లేలో రెండు కెమెరాలు పెట్టేస్తోంది
23-10-201923-10-2019 16:25:06 IST
Updated On 24-10-2019 17:31:09 ISTUpdated On 24-10-20192019-10-23T10:55:06.763Z23-10-2019 2019-10-23T10:55:02.853Z - 2019-10-24T12:01:09.007Z - 24-10-2019

శాంసంగ్, ఒప్పొ.. ఇప్పుడు షావోమీ. ఇన్ డిస్ప్లే కెమెరా ఫోన్ల వరుసలోకి షావోమీ కూడా వచ్చేస్తోంది. శాంసంగ్ ఇటీవలే ఇన్ డిస్ప్లే కెమెరా ఫోన్ల మాస్ ప్రొడక్షన్ మొదలుపెట్టింది. ఒప్పో కూడా అదే పనిలో ఉంది. ఇటీవల దీనికి సంబంధించిన కొంత సమాచారాన్ని కూడా తెలియజేసింది. అయితే ఇన్ డిస్ప్లే కెమెరాల గురించి తొలుత మాట్లాడింది షావోమీనే. చాలా రోజుల క్రితమే షావోమీ ఇన్‌డిస్‌ప్లే కెమెరాల గురించి టీజ్ చేసింది. ఇన్‌డిస్‌ప్లే కెమెరాల ఫీచర్‌తో ఓ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు షావోమీ చాలా రోజుల క్రితం తెలియజేసింది. అయితే చాలా రోజుల నుంచి ఈ విషయంలో ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడు ఈ విషయంలో షావోమీ వేగం పెంచినట్లు తెలుస్తోంది. దీని పేటెంట్‌కి సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయట. ఇటీవల చైనా నేషనల్ ఇంటలెక్చువల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి షావోమీ ఈ ఫోన్‌కు సంబంధించిన పేటెంట్ కూడా పొందిందట. ఇన్ డిస్ప్లే కెమెరాల వైపు మొబైల్ కంపెనీలు వచ్చేస్తున్నాయి. దీంతో నాచ్, పాప్ అప్ సెల్ఫీ కెమెరా లాంటి ఆప్షన్లు ఇక అవసరం లేదని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇంత అత్యాధునిక టెక్నాలజీని మొబైల్ సంస్థలు ఫ్లాగ్షిప్ ఫోన్స్‌లో కాకుండా మిడ్ రేంజ్, లో రేంజ్ ఫోన్స్‌లో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయట. దీని కారణం అందులో ఫొటోలు ఫ్లాగ్షిప్ రేంజీలో రావని చెబుతున్నారు. ట్రాన్స్పరెంట్ డిస్ప్లే ద్వారా కెమెరాలను ఇన్ డిస్ప్లే ఆప్షన్లో తీసుకొస్తున్నారు. అయితే దీని వల్ల కెమెరా నాణ్యత అంత బాగుండదనే వాదనలూ వినిపిస్తున్నాయి. డిస్ప్లే ప్యానల్ వల్ల లోపల కెమెరాలోకి వెలుతురు సరిగ్గా వెళ్లక ఫొటోలు అంత నాణ్యతతో రావని చెబుతున్నారు. దీని కోసం కెమెరాలో మరిన్ని మార్పులు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న సాంకేతికతను పూర్తిగా అభివృద్ధి చేస్తే ఇన్ డిస్ప్లే కెమెరాలు కూడా మరింత మెరుగైన ఫొటోలు తీస్తాయట.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా