షావోమీ కొత్త మొబైల్స్ వచ్చేస్తున్నాయ్.. ఇదిగో సర్టిఫికెట్
27-10-201927-10-2019 16:22:36 IST
2019-10-27T10:52:36.889Z27-10-2019 2019-10-27T10:52:33.730Z - - 17-04-2021

షావోమీ మనసు మార్చుకుందా... తాజా వార్తల బట్టి చూస్తే అదే అనిపిస్తోంది. షావోమీ నుంచి ఇకపై నోట్ సిరీస్ మొబైల్స్ రావని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు ఈ ఏడాది మొదట్లో చెప్పారు. కానీ ఇప్పుడు షావోమీ నోట్ సిరీస్ మొబైల్ ఒకటి రూపొందుతోందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని సర్టిఫికెట్లు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. వాటి ప్రకారం ఎంఐ నోట్ 10, ఎంఐ నోట్ 10 ప్రో మొబైళ్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి థాయ్‌లాండ్‌లో సర్టిఫికెట్ పొందింది. థాయ్‌లాండ్ నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ టెలీ కమ్యూనికేషన్స్ కమిషన్ ఇటీవల ఎంఐనోట్10 సిరీస్‌కు సర్టిఫికెట్ ఇష్యూ చేశాయి. ఎంఐనోట్ 10 సిరీస్ మొబైల్స్ వస్తాయని ఇటీవల వార్తలొచ్చాయి. మొబైల్‌కు సంబంధించిన రిటైల్ బాక్స్ బయటకు వచ్చింది. ఇప్పుడు థాయ్‌లాండ్‌తో పాటు రష్యా సీఈసీ నుంచి కూడా సర్టిఫికెట్ పొందిందిట. వాటి లెక్క ప్రకారం అయితే ఎంఐనోట్ 10కి ఎం1910ఎఫ్4జి అని కోడ్ నేమ్ ఇచ్చారు. అదే నోట్10 ప్రో కి ఎం1910ఎఫ్4ఎస్ అనే కోడ్‌నేమ్‌తో సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ మొబైల్స్‌కు సంబంధించి స్పెసిఫికేషన్ల విషయంలో ఎలాంటి సమాచారం లేదు. ఈ మొబైల్స్‌ను ఈ నెలాఖరులో విడుదల చేస్తారని వార్తలొచ్చాయి. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి సమాచారం లేదు. ఎంఐ నోట్ 10 సిరీస్ మొబైల్స్ మన దేశంలో వస్తాయో లేదో అనే విషయంలో ఎలాంటి సమాచారం లేదు. మామూలుగా అయితే ఎంఐ సిరీస్ మొబైల్స్ మనదేశానికి ఈ మధ్యకాలంలో రావడం లేదు. ఇక్కడ కేవలం రెడ్మీ మొబైల్స్ ను మాత్రమే లాంచ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంఐ సిరీస్ కొత్త మొబైల్స్ మనకు రావడం కష్టమే. అయితే అదే ఫీచర్లతో వేరే పేర్లతో ఆ మొబైల్స్ మనకు రావొచ్చు. ఇప్పటికే కొన్ని అలా వచ్చాయి కూడా. ఎంఐసీసీ సిరీస్ మొబైల్స్ ఫీచర్లతో ఎంఐఏ3 మన మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు ఇవి కూడా అలానే వస్తాయేమో.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా