newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

షావోమీ కొత్త ‘నోట్‌’ ఇలానే ఉంటుంది...

01-11-201901-11-2019 10:57:21 IST
2019-11-01T05:27:21.050Z01-11-2019 2019-11-01T05:27:08.287Z - - 14-04-2021

షావోమీ కొత్త ‘నోట్‌’ ఇలానే ఉంటుంది...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చైనా మొబైల్‌ కంపెనీ షావోమీ ‘నోట్‌’ సిరీస్‌లో కొత్త మొబైల్‌ను లాంచ్‌ చేయబోతోంది. దీనికి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్‌ను షావోమీ అధికారిక వీబో ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఈ నెల 14న ఈ మొబైల్‌ను లాంచ్‌ చేస్తారు. ఈ విషయాన్ని షావోమీ పోలెండ్‌ ఫేస్‌బుక్‌ పేజీలో తెలిపింది. దీంతోపాటు ఈ మొబైల్‌ గురించి కొన్ని స్పెసిఫికేషన్లు కూడా బయటకు తీసుకొచ్చింది. ఈ మొబైల్‌లో 5,260 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. గతంలో వచ్చిన ఎంఐసీసీ9 ప్రోలో కూడా ఇంతే బ్యాటరీ ఉండబోతోంది. దీనిని ఈ నెల 5న చైనాలో విడుదల చేస్తారు. ఈ రెండూ ఒకటే అనేది టెక్‌ వర్గాల మాట. అయితే గీక్‌బెంచ్‌లో ఈ రెండు మొబైళ్లు మెరిశాయి. రెండింటిలో పెద్ద తేడా లేదు. 

షావోమీ పోలండ్‌ ఫేస్‌బుక్‌ పేజీలో కొన్ని ఫొటోలను టీజ్‌ చేశారు. వాటి ప్రకారం చూస్తే ఎంఐ నోట్‌ 10 లాంచ్‌ ఈవెంట్‌కి సంబంధించినవే అనిపిస్తోంది. అయితే పోలండ్‌లో లాంచ్‌.. గ్లోబల్‌ లాంచా లేదా అనేది తెలియాల్సి ఉంది. అంటే పోలండ్‌లో లాంచ్‌ చేసే ఎంఐ నోట్‌ 10 విదేశాలకు వర్తిస్తుందా లేదా అనేది షావోమీ చెప్పడం లేదు. ఇప్పటివరకు తెలిసిన ఫీచర్ల ప్రకారం అయితే కొత్త మొబైల్‌లో 30 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఆప్షన్‌ ఉంటుంది. ఈ మొబైల్‌ స్నో అరోరా, మ్యాజిక్‌ గ్రీన్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.  ఆండ్రాయిడ్‌ 9 ఆధారిత ఎంఐయూఐతో ఈ మొబైల్‌ పని చేస్తుంది.  6 జీబీ ర్యామ్‌తో ఈ మొబైల్స్‌ మొదలవుతాయి. 

ఎంఐ నోట్‌ 10 మొబైల్‌లో 8 జీబీ ర్యామ్‌ వెర్షన్‌ కూడా ఉండబోతోందట. 12 జీబీ ర్యామ్‌ తో ఈ మొబైల్‌ రాబోతోందట. ఇందులో ముందువైపు 32 ఎంపీ కెమెరా ఉండబోతోంద. 256 జీబీ అంతర్గత మెమొరీతో ఈ కొత్త నోట్‌10 తీసుకొస్తున్నారు. 6.47 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ స్క్రీన్‌ తీసుకొస్తున్నారు. వెనుకవైపు 108 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. దీంతోపాటు 20 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 12 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ను తీసుకొస్తున్నారు. క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 730జి ప్రాసెసర్‌ ఉంటుంది. గేమింగ్‌ కోసం ప్రత్యేకంగా ఈ మొబైల్‌ను తీసుకొచ్చారు. అయితే ఈ మొబైల్‌ భారత్‌కు ఏ పేరుతో వస్తుందనే విసయంలో స్పష్టత లేదు. మామూలుగా అయితే ఎంఐ సిరీస్‌ మొబైళ్లు మన దేశానికి రావడం లేదు. వేరే పేరు పెట్టి తీసుకొచ్చే అవకాశం ఉంది. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle