newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

షావోమీ కొత్త ఓఎస్‌లో సరికొత్త ఫీచర్లు... భలే ఉన్నాయ్‌ తెలుసా!

23-09-201923-09-2019 19:33:26 IST
2019-09-23T14:03:26.300Z23-09-2019 2019-09-23T14:03:23.416Z - - 14-04-2021

షావోమీ కొత్త ఓఎస్‌లో సరికొత్త ఫీచర్లు... భలే ఉన్నాయ్‌ తెలుసా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తనదైన స్టైల్‌లో మార్పులు చేసి అందిస్తుంటుంది షావోమీ. ఎంఐయూఐ పేరుతో వచ్చే ఈ యూజర్‌ ఇంటర్ఫేస్‌ (యూఐ)లో చాలా ఆసక్తికరమైన ఫీచర్లు ఉంటాయి. కస్టమ్‌ యూఐ ఇష్టపడేవారికి ఎంఐయూఐ బాగా నచ్చతుంది. ఇప్పుడు ఈ యూఐకి 11 వ వెర్షన్‌ సిద్ధమవుతోంది. త్వరలో ఎంఐయూఐ11ను విడుదల చేస్తారు. దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఫీచర్ల వివరాల బయటకు వచ్చాయి. 

ఎంఐయూఐ 11 బీటా టెస్టింగ్‌ జరుగుతోంది. ఇటీవల ఈ వెర్షన్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ కూడా జరిగిన విషయం తెలిసిందే. అందులో భాగంగా చిల్ట్రన్స్‌ స్పేస్‌, ఎర్త్‌ క్వేక్‌ అలర్ట్‌ ఫీచర్లను ప్రకటించారు. ఇప్పుడు మరో ఫీచర్‌ వివరాలు తెలిశాయి. అదే ఫ్యామిలీ షేరింగ్‌. ప్రస్తుతం యాపిల్‌ ఓఎస్‌లో ఉన్న ఫ్యామిలీ షేరింగ్‌ ఫీచర్‌ తరహాలోనే ఇదీ పని చేస్తుంది. 

ఈ ఫీచర్‌తో ఒకే కుటుంబంలోని వ్యక్తులు ఒకరి నుంచి మరొకరు వేగంగా, పూర్తి భద్రతతో సమాచారం, ఫొటోలు, వీడియోలు లాంటివి పంపించుకోవచ్చు. అంటే ఇప్పుడు వాడుతున్న షేర్‌ ఇట్‌ లాంటివి అవసరం లేకుండా అన్నమాట. అంటే మొబైల్స్‌ పక్కపక్కనే లేకపోయినా ఈ ఫీచర్‌ ద్వారా సమాచారాన్ని షేర్‌ చేసుకోవచ్చు. 

ఫ్యామిలీ షేరింగ్‌ ఆప్షన్‌ ద్వారా కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారనేది ట్రాక్‌ చేయొచ్చు. అలాగే గూగుల్‌ ఫ్యామిలీ షేరింగ్‌ స్టైల్‌లో కుటుంబ సభ్యులు మొబైల్‌ని ఎంత సేపు వినియోగించాలి, ఏ యాప్‌ను ఎంత సేపు వాడాలి అనేది కూడా నిర్ణయించుకోవచ్చు. అంటే వాట్సాప్‌ను రోజులో 15 నిమిషాలే వాడాలి అని ఇంటి పెద్ద నిర్ణయిస్తే ఇక ఆ యూజర్‌ అంతసేపే వాడొచ్చు.

ఈ ఫీచర్‌లో మరో సౌకర్యమూ ఉంది. ఫ్యామిలీ ఫీచర్‌ను వాడాలంటే కుటుంబంలో ఒకరికి షావోమీ మొబైల్‌ ఉంటే చాలు. మిగిలిన వారు వేరే ఆండ్రాయిడ్‌ లేదా యాపిల్‌ ఫోన్‌ వాడినా ఓకే. 

కొత్త ఎంఐయూఐ 11ను ఈ నెల 24న చైనాలో అధికారికంగా విడుదల చేస్తున్నారు. కొత్త మొబైళ్లు ఎంఐ మిక్స్‌ ఆల్ఫా, ఎంఐ9 ప్రో 5జీ మొబైల్స్‌ లాంచింగ్‌ కోసం ఈవెంట్‌ జరగనుంది. అందులో భాగంగానే ఎంఐయూఐ11 నులాంచ్‌ చేస్తారు. ఇదే వేదిక మీద ఎంఐటీవీ ప్రో 8కేను కూడా లాంచ్‌ చేస్తారు. 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle