newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

షావోమీ ‘ఎనిమిది’ సిరీస్‌లో మరో ఫోన్‌ వస్తోంది!

08-10-201908-10-2019 18:57:24 IST
Updated On 09-10-2019 10:17:43 ISTUpdated On 09-10-20192019-10-08T13:27:24.017Z08-10-2019 2019-10-08T13:27:18.819Z - 2019-10-09T04:47:43.074Z - 09-10-2019

షావోమీ ‘ఎనిమిది’ సిరీస్‌లో మరో ఫోన్‌ వస్తోంది!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బడ్జెట్‌ మొబైల్స్‌ లో భారతీయ మార్కెట్‌ రారాజుగా వెలుగొందుతున్న షావోమీ నుంచి మరో ఫోన్‌ రాబోతోంది. ‘ఎనిమిది’ సిరీస్‌లో కొత్త మొబైల్‌ను తీసుకురాబోతోంది. ఇటీవల రెడ్‌మి 8A ను తీసుకొచ్చిన షావోమీ ఇప్పుడు రెడ్‌మి 8 ను తీసుకురాబోతోంది. బుధవారం (అక్టోబరు 9)న ఈ మొబైల్‌ ను భారత మార్కెట్‌లో లాంచ్‌ చేయబోతున్నారు. దీని కోసం షావోమీ ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది. 

రెడ్‌మి 8 లాంచ్‌ గురించి షావోమీ ఇండియా చీఫ్‌ మనుకుమార్‌ జైన్‌ ట్వీట్‌ చేశాడు. హ్యాష్‌ ట్యాగ్‌ ద్వారా 9న రెడ్‌మి8 వస్తున్నట్లు చెప్పాడు. 22 సెకన్ల ఆ ట్వీట్‌ వీడియోలో మొబైల్‌ ప్రత్యేకతను వివరించారు. ఈ మొబైల్‌ స్క్రాచ్‌, స్ప్లాష్‌ రెస్టిస్టెంట్‌ గా ఉండోబోతోంది. అయితే ఈ మొబైల్‌ స్లోగన్‌ చూస్తే ఇందులో పెద్ద బ్యాటరీ, మెరుగైన కెమెరాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ‘బ్యాటరీ కెమెరా యాక్షన్‌’ అంటూ షావోమీ ఈ మొబైల్‌ గురించి టీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. 

ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం రెడ్‌మి 8 లో వెనుకవైపు రెండు కెమెరాలు ఉంటాయి. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండబోతున్నట్లు సమాచారం. రెడ్‌మి 8A లోనూ 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇచ్చిన విషయం తెలిసిందే. డాట్‌ నాచ్‌ డిస్‌ప్లేతో 720X1520 పిక్సల్స్‌ రిజల్యూషన్‌లో ఈ మొబైల్‌ రాబోతోంది. 3 జీబీ ర్యామ్‌, 4 జీబీ ర్యామ్‌ వెర్షన్లు ఉంటాయి. పాలికార్బనేట్‌ బాడీతో రాబోతున్న ఈ మొబైల్‌లో వెనుకవైపు ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంటుంది. రెడ్‌మి 8A లో ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ లేదు. ఆండ్రాయిడ్‌ 9 ‘పై’ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారిత ఎంఐయూఐ ఆధారంగా ఈ మొబైల్‌ పని చేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 439 ప్రాసెసర్‌ ఉండొచ్చు. 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle