newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

షావోమీ ఎంఐ మిక్స్‌... బాబోయ్‌ ఫీచర్లు అదిరిపోయాయిగా!

24-09-201924-09-2019 17:55:14 IST
2019-09-24T12:25:14.420Z24-09-2019 2019-09-24T12:25:12.243Z - - 12-04-2021

షావోమీ ఎంఐ మిక్స్‌... బాబోయ్‌ ఫీచర్లు అదిరిపోయాయిగా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బడ్జెట్‌ ఫోన్లలో భలే ఫీచర్లు అందిస్తుంటుంది షావోమీ.  అదే ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లు, అంతకుమించిన ఆప్షన్లు కావాలంటే మాత్రం మిక్స్‌ సిరీస్‌ ఫోన్లు కొనాల్సిందే. తాజాగా ఈ సిరీస్‌లో ఓ మొబైల్‌ను సంస్థ లాంచ్‌ చేసింది. చైనాలో విడుదలైన మి మిక్స్‌ ఆల్ఫాలో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.

మచ్చుకు కొన్ని చెప్పాలంటే వ్రాప్‌ అప్‌ అరౌండ్‌ డిస్‌ప్లే ఒకటి.. మరకొటి 108 ఎంపీ కెమెరా. ప్రస్తుతం చైనాలో మాత్రమే ఈ మొబైళ్లను లాంచ్‌ చేశారు. మరి మనదేశానికి తీసుకొస్తారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. మిక్స్‌ సిరీస్‌లో గత రెండు ఫోన్లు మనకు రాలేదు. మరి దీనికి తీసుకొస్తారేమో చూడాలి.

మిక్స్‌ ఆల్ఫాలో డిస్‌ప్లే అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇన్నాళ్లూ మీరు శాంసంగ్‌లో కర్వ్‌ డిస్‌ప్లే చూశారు. హువావేలో వాటర్‌ ఫాల్‌ డిస్‌ ప్లే చూశారు. ఆ రెండింటినీ తలదన్నేలా మిక్స్‌ ఆల్ఫాలో వ్రాప్‌ అప్‌ అరౌండ్‌ డిస్‌ప్లే ఉంది. అంటే స్క్రీన్‌ ఓవైపు మొదలై... వెనుక వైపు అంచుల వరకు ఉంటుంది. ఒకవిధంగా ఇది ఫోల్డింగ్‌ మొబైల్‌లానూ, మరోవైపు నుంచి చూస్తే డ్యూయల్‌ డిస్‌ప్లే మొబైల్‌లానూ ఉంటుంది.

సాధారణ మొబైల్స్‌ లో ఉండే స్క్రీన్‌ టు బాడీ రేషియోకు డబుల్‌ ఇందులో ఉంటుంది. అంటే 180 శాతం వరకు ఉంటుందన్నమాట. హువావే మేట్‌ ఎక్స్‌ ఫోల్డింగ్‌ ఫోన్‌ కన్నా ఇది ఎక్కువంట.  బాడీ అంతా సాఫైర్‌ గ్లాస్‌తో ప్రొటెక్ట్‌ చేయబడి ఉంటుంది. 

ఎంఐ మిక్స్‌ ఆల్ఫాలో స్నాప్‌డ్రాగన్‌ 855 ప్లస్‌ ప్రాసెసర్‌ ఉంటుంది. 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ అంతర్గత మెమొరీ ఉంటాయి. 4050 ఎంఏహెచ్‌ నానో సిలికాన్‌ కాథోడ్‌ పవర్‌ సెల్‌ బ్యాటరీ ఉంటుంది. 40 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.  మొబైల్‌ ఎడ్జెస్‌ని ప్రెజర్‌ సెన్సిటివ్‌గా తీర్చదిద్దారు. డిస్‌ప్లే అకౌస్టిక్‌ టెక్నాలజీ సాంకేతికత ద్వారా మొబైల్‌ స్క్రీన్‌ స్పీకర్‌గా పని చేస్తుంది.  దీని వల్ల మొబైల్‌లో స్పీకర్‌ కానీ ఇతర హోల్స్‌ కానీ ఉండవు. దీంతోపాటు ఇందులో అల్ట్రాసోనిక్‌ సెన్సర్‌ కూడా ఉంటుంది. దీని ద్వారా పామ్‌ గెస్చర్స్‌ను వాడుకోవచ్చు. 

మిక్స్‌ ఆల్ఫాలో ఆర్టిఫిషియల్‌ ఆల్గారిథమ్స్‌ను మరింత ప్రభావవంతంగా వినియోగించారు. ఇందులో సరికొత్త 108 ఎంపీ శాంసంగ్‌ కెమెరా సెన్సర్‌ ఉంటుంది. రెండువైపులా డిస్‌ప్లే ఉండటం వల్ల వెనుకవైపు ఉన్న కెమెరానే సెల్ఫీ కెమెరాగా వినియోగించుకోవచ్చు.

పిక్సల్‌ బిన్నింగ్‌ ద్వారా ఆ ఫొటోలు 27 ఎంపీ ఫొటోలుగా మారుతాయి. దీంతోపాటు ఈ మొబైల్‌లో 20 ఎంపీ అల్ట్రా వైడ్‌ సెన్సర్‌ ఉంటుంది. దీని ద్వారా 117 డిగ్రీల ఫొటోలు తీసుకోవచ్చు. 12 ఎంపీ టెలీఫొటో లెన్స్‌ కూడా ఉంటుంది. కెమెరాల లెన్స్‌ల మీద సాఫైర్‌ గ్లాస్‌ ప్రొటక్షన్‌ను అందిస్తున్నారు. చైనాలో ఈ మొబైల్‌ ధర సుమారు 20 వేల యువాన్లు. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle