newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

షాకిచ్చిన గూగుల్... రెండు సర్వీసులు డౌన్

14-12-201814-12-2018 18:45:01 IST
Updated On 14-12-2018 18:44:58 ISTUpdated On 14-12-20182018-12-14T13:15:01.421Z14-12-2018 2018-12-14T13:14:58.345Z - 2018-12-14T13:14:58.347Z - 14-12-2018

షాకిచ్చిన గూగుల్... రెండు సర్వీసులు డౌన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గూగుల్... ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ సంస్థ! ప్రతిక్షణం తనను తాను అప్‌డేట్ చేసుకుంటూ, వినియోగదార్లకు వీలుగా సర్వీసులు అందిస్తూ... తిరుగులేని స్థానాన్ని కైవసం చేసుకుంది. మార్కెట్‌లో ఏ ఇతర సేవలు పోటీగా వస్తున్నా... వాటికి ధీటుగా సమాధానం చెప్తుంది. అలాంటి ఈ సంస్థ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్ళూ లక్షలాదిమంది యూజర్లకు అందించిన రెండు గొప్ప సర్వీసుల్ని శాశ్వతంగా మూసివేయాలని ఫిక్స్ అయ్యింది. అవే... గూగుల్ ప్లస్, గూగుల్ హ్యాంగవుట్స్!

నిజానికి... ఈ రెండు గూగుల్ సర్వీసులు ఫేస్‌బుక్, మెస్సేంజర్‌లాగా సోషల్ మీడియాలో ఒక కుదుపు కుదిపేశాయి. ఫేస్‌బుక్ తరహాలోనే ఈ రెండు సర్వీసుల న్యూస్‌ఫీడ్, మెసేజ్‌లు పంపే విధానం దాదాపు పోలి ఉంటుంది. కానీ... ఫేస్‌బుక్ సేవలకు జనాల్లో ఎక్కువ ఆదరణ రావడంతో ఆ రెండు గూగుల్ సర్వీసులు డీలా పడ్డాయి. యూజర్ల యాక్టివిటీ దారుణంగా పడిపోయింది. దీంతో గూగుల్ సంస్థ వాటిపై పెద్దగా ఫోకస్ పెట్టలేకపోయింది. దీన్నే అలుసుగా తీసుకున్న హ్యాకర్లు... గూగుల్ ప్లస్ యూజర్ల డేటాను చోరీ చేశారు. అది కూడా వేలల్లో కాదు... అక్షరాల 52.5 మిలియన్ గూగుల్ ప్లస్ యూజర్ల సమాచారం చోరీ అయ్యింది. ఇది గుర్తించిన గూగుల్ సంస్థ... ఈ సమస్యను పరిష్కరించడం కంటే మొత్తానికే ఆ సర్వీస్‌ని మూసెయ్యడం మేలని భావిస్తోంది. ఏప్రిల్ 2019 నుంచి గూగుల్ ప్లస్ సేవలను నిలిపివేయాలని ఫిక్స్ అయ్యింది.

ఇక గూగుల్ హ్యాంగవుట్స్ విషయానికొస్తే... మొదట్లో ఉన్నంత ఆదరణ ఇప్పుడు లేకపోవడంతో దీన్ని షట్ డౌన్ చేయాలనుకుంది. ఈ మెసేజింగ్ యాప్‌లో యూజర్స్‌కి కావాల్సిన ఎమోజీలు, కార్టూన్స్, ఇతర సౌకర్యాలున్నా... ఇతర మెసేజింగ్ యాప్స్‌ల ఇది పాపులర్ అవ్వలేదు. దీంతో 2020 కల్లా దీని సేవల్ని నిలిపివేయాలని గూగుల్ ఫిక్స్ అయ్యింది. అయితే... ఈ యాప్‌కు బదులుగా మరో మెసేజింగ్ యాప్‌ను అధునాతన ఫీచర్స్‌తో తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle