శాన్ డిస్క్ సంచలనం... 1 టీబీ మైక్రో ఎస్డీ కార్డు
26-02-201926-02-2019 16:04:10 IST
2019-02-26T10:34:10.087Z26-02-2019 2019-02-26T10:34:05.960Z - - 15-04-2021

ఒకప్పుడు మైక్రో ఎస్డీ కార్డులు చాలా తక్కువ మెమరీతో ఉండేవి. ఇప్పుడు మైక్రో ఎస్డీకార్డులు కూడా చాలా ఎక్కువ మెమరీతో మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా శాన్ డిస్క్ సరికొత్త సంచలనానికి తెరతీసింది. జస్ట్ సిమ్ కార్డ్ సైజులో ఉండేలా ఒక TB మైక్రో SD కార్డును విడుదలచేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే తొలి 1TB మైక్రో ఎస్డీ కార్డు ఇది. మొబైళ్లలో ఎక్కువ స్పేస్ కావాలనుకుంటున్న యూజర్లకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో వీడియోలు, సినిమాలు, సాంగ్స్, మ్యూజిక్ ట్రాక్స్ ఇలా ఎన్ని స్టోర్ చేసుకున్నా... 1024 GB కావడం వల్ల... ఎలాంటి ప్రాబ్లం ఉండదంటోంది కంపెనీ. శాన్ డిస్క్ విడుదలచేసిన 1 TB మైక్రో స్టోరేజ్ మెమరీ కార్డ్ సెకండ్‌కి 160 మెగాబైట్ల వేగంతో పనిచేస్తుంది. ప్రస్తుతం ఉన్న మైక్రో ఎస్డీ కార్డుల కంటే ఇది రెట్టింపు వేగం. అందువల్ల దీన్ని హైఎండ్ ఫోన్లకూ, హైఎండ్ డ్రోన్ కెమెరాలకూ, డిజిటల్, DSLR కెమెరాలకూ ఉపయోగించవచ్చు.ఈ 1టీబీ మైక్రో ఎస్డీ కార్డ్ శాన్డిస్క్ వెబ్ సైట్లో మాత్రమే ప్రస్తుతం లభిస్తోంది. మిగతా ఈ-కామర్స్ సైట్లలోనూ లభించాలంటే... ఈ ఏడాది ఏప్రిల్ వరకూ ఆగాలి. దీని ప్రారంభ ధరను కంపెనీ రూ.35,496గా నిర్ణయించింది. 1 టీబీ కంటే తక్కువ మెమరీ కలిగిన 512GB మైక్రో ఎస్డీ కార్డు ధర రూ.14,210గా కంపెనీ ప్రకటించింది. మొత్తం మీద మెమరీ కోసం తపించే స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఇది చక్కని సువర్ణావకాశం.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా