newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

శాంసంగ్ మేకిన్ ఇండియా స్మార్ట్ వాచ్‌లు .. ధర తక్కువే!

11-07-202011-07-2020 13:17:11 IST
Updated On 11-07-2020 14:24:29 ISTUpdated On 11-07-20202020-07-11T07:47:11.764Z11-07-2020 2020-07-11T07:46:57.328Z - 2020-07-11T08:54:29.612Z - 11-07-2020

శాంసంగ్ మేకిన్ ఇండియా స్మార్ట్ వాచ్‌లు .. ధర తక్కువే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చైనాపై వ్యతిరేకత నేపథ్యంలో భారత్ లో ఇతర దేశాల ఉత్పత్తులకు తెగ గిరాకీ పెరిగిపోతోంది. తాజాగా శాంసంగ్ సరికొత్త స్మార్ట్ వాచ్‌లు  అలరించనుంది. మేకిన్‌ ఇండియా స్పూర్తితో నోయిడాలో స్మార్ట్‌ వాచ్‌ల తయారీని ప్రారంభించింది శాంసంగ్. ఇటీవలే అత్యాధునిక టెక్నాలజీతో  స్మార్ట్‌వాచ్‌ను శాంసంగ్‌ విడుదల చేసింది. ఈ వాచ్‌ ధరను రూ. 28,490 రూపాయలుగా నిర్ణయించింది. ఇవాళ మార్కెట్‌లోకి విడుదలయ్యే స్మార్ట్ వాచ్‌ 4జీ పేరుతో అత్యాధునిక స్మార్ట్‌ వాచ్‌ వినియోగదారులను అలరించనుంది.

దీనికి గ్యాలెక్సీ వాచ్‌ యాక్టివ్‌2గా పేరు పెట్టారు. మేకిన్‌ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా దేశంలో 18 స్మార్ట్‌ వాచ్‌ల తయారీని ప్రారంభించినట్లు శాంసంగ్‌ ఇండియా ప్రకటించింది. దీనివల్ల ధరలు తక్కువగా అందుబాటులోకి వస్తాయని తెలిపింది. 

శాంసంగ్‌ కంపెనీ గాలెక్సీ స్మార్ట్‌ వాచ్‌లను మూడు రకాలైన సైజుల్లో అందుబాటులోకి తెచ్చింది. అవి 42ఎమ్‌ఎం, 44ఎమ్‌ఎం, 46ఎమ్‌ఎంలో దొరుకుతాయి, దేశంలో తయారు కానున్న 18స్మార్ట్‌ వాచ్‌ల ధర రూ.19, 990 నుంచి రూ. 35,990గా  శాంసంగ్‌ నిర్ణయించింది. ఇవాళ విడుదలయ్యే శాంసంగ్‌ సరికొత్త స్మార్ట్‌ వాచ్‌లో ఇ సిమ్‌ కనెక్టివిటీతో వినియోగదారులకు కాల్స్‌, మెసేజెస్‌, నోటిఫికేషన్స్ తదితర అత్యాధునిక సేవలను స్మార్ట్‌ వాచ్‌ అందించనుంది. అంటే మీదగ్గర వాచ్ వుంటే స్మార్ట్ ఫోన్ మణికట్టుపై వున్నట్టే.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle