newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

‘శాంసంగ్’ మరో సెన్సేషన్... మెదడులో రిమోట్

14-11-201814-11-2018 18:21:59 IST
Updated On 14-11-2018 18:21:59 ISTUpdated On 14-11-20182018-11-14T12:51:59.217Z14-11-2018 2018-11-14T12:51:59.217Z - 2018-11-14T12:51:59.220Z - 14-11-2018

‘శాంసంగ్’ మరో సెన్సేషన్... మెదడులో రిమోట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ట్రెండ్‌ని ఫాలో అవ్వడంలో కాదు... ట్రెండ్ సృష్టించడంలో శాంసంగ్ దిట్ట! ఇప్పటికే ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. మొబైల్ రంగం నుంచి భారీ భవంతుల్ని నిర్మించేదాకా... అన్నిచోట్లా శాంసంగ్‌దే డామినేషన్! మిగతా కంపెనీలో ఆలోచనలో ఉండగానే... ఇది ఆచరణలోకి తీసుకొస్తుంది. కొన్నిసార్లు విఫలమైనా... చాలాసార్లు చరిత్ర లిఖించిన ఘనత ఈ ఒక్క సంస్థకే సొంతం! ఇప్పుడిది మరో చారిత్రాత్మక ప్రయోగాన్ని త్వరలోనే అమలులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. రిమోట్ అవసరం లేకుండానే కేవలం మెదడు ద్వారా టివికి సంకేతాలు పంపించేలా కొత్త టెక్నాలజీని రూపుదిద్దుతోంది. స్విట్జర్లాండ్‌లోని Center of Neuroprosthetics of the Ecole Polytechnique Fédérale de Lausanne (EPFL) సహాయంతో దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఈ ప్రాజెక్ట్‌పై ప్రయోగత్మాకంగా పరీక్షలను నిర్వహిస్తోంది.

కేవలం టివిని కంట్రోల్ చేయడమే కాదు... ఇతర శారీరక పరీక్షలు జరపడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని సంస్థ వెల్లడించింది. ‘quadriplegia’ అంటే ఇతరుల సహాయం లేకుండా తమకు నచ్చిన షోలను తిలకించే విధంగా కసరత్తు చేస్తున్నారు. ఈ టెక్నాలజీలో భాగంగా ముందుగా టీవీని మెదడు సంకేతాల ద్వారా ఎలా కంట్రోల్ చేయాలనే దానిపై ప్రయోగాలు చేస్తున్నామని... దీనికోసం ఒక హెడ్‌సెట్ రూపొందిస్తున్నామని... ఇందులో 64 సెన్సార్లను పొందుపరిచామని EPFL సీనియర్ శాస్ర్తవేత్త Ricardo Chavarriaga తెలిపారు. ఈ సెన్సార్ల ద్వారా కంటి కదలికలతోనే టీవిని ఆపరేట్ చేయవచ్చని వెల్లడించారు. దీనికి సంబంధించి శాన్ ప్రాన్సిస్కోలో ఓ డెవలపర్ సదస్సును కూడా నిర్వహించింది. ఇందులో భాగంగా... ఒక వ్యక్తి తానున్న ప్రదేశం నుంచి ఏమాత్రం కదలకుండా, ఎదురుగా ఉన్న వాటిని మెదడుతో ఎలా కంట్రోల్ చేయాలన్న దానిపై ప్రధానంగా చర్చించారు. టెక్నాలజీ చాలా కొత్త మార్పులకు వేదికగా నిలుస్తోందని... మనుషులకు టెక్నాలజీకి మధ్య ఉన్న సంబంధాన్ని మరింతగా అభివృద్ధి చేసి సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   20 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle