newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

శాంసంగ్ బడ్జెట్ ఫోన్లు .... ధరెంతో తెలుసా?

02-06-202002-06-2020 19:39:57 IST
2020-06-02T14:09:57.676Z02-06-2020 2020-06-02T14:09:32.599Z - - 03-08-2020

శాంసంగ్ బడ్జెట్ ఫోన్లు .... ధరెంతో తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో దూసుకుపోతోంది మిగతా కంపెనీలతో పోలిస్తే శాంసంగ్ లేటెస్ట్ మోడల్స్ విడుదలవుతూనే వున్నాయి. కరోనా ఎఫెక్ట్ తో కాస్త ఆలస్యం జరుగుతున్నా గెలాక్సీ ఎం11, గెలాక్సీ ఎమ్01 పేరుతో రెండు బడ్జెట్  ఫోన్లను విడుదల చేసింది. చైనా కంపెనీలకు ధీటుగా శాంసంగ్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ ఫోన్ల ఫీచర్లు, ధర ఎలా వుందో ఒకసారి చూద్దాం. ఆఫ్ లైన్, ఆన్ లైన్లోనూ ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ షేర్ ఈ విధంగా వున్నాయి

ఆండ్రాయిడ్ 72.52 శాతం

ఐఒఎస్ 26.08 శాతం

శాంసంగ్ 0.21 శాతం

కైయోస్ 0.21 శాతం

విండోస్ 0.03 శాతం 

 

గెలాక్సీ ఎం11 

గతంలో వచ్చిన గెలాక్సీ ఫోన్లకు తగ్గట్గుగా శాంసంగ్ ఎం11 సిరీస్ తో రెండు వేరియంట్లను విడుదలచేసింది. ఈ ఫోన్లు 3జీబీ/32 జీబీ ఫోన్లు మూడు రంగుల్లో లభ్యం అవుతున్నాయి. 3జీబీ/32 జీబీ ధర రూ.10.999 గాను, 4జీబీ/64 జీబీ ధర రూ.12.999 గా వున్నాయి. 

స్పెసిఫికేషన్లు:

* ఆండ్రాయిడ్ 10

*బ్లాక్, మెటాలిక్, బ్లు, వయొలెట్ కలర్స్

*6.4 అంగుళాల హెడ్ డీ+ ఇన్ఫినిటీ ఓ డిస్ ప్లే

* 1 యుఐ 2.O ప్రాసెసర్

* స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్

* 13+5+2 ఎంపీ కెమేరాలు

* ముందు వైపు 8 మెగాపిక్సెల్ కెమేరా

* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

*15 డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ 

* 3జీబీ/32 జీబీ ధర రూ.10.999

*4జీబీ/64 జీబీ ధర రూ.12.999

గెలాక్సీ ఎమ్ 01 

శాంసంగ్ గెలాక్సీ ఎమ్ జీరో1 కేవలం 3జీబీ/32 జీబీ వేరియంట్లో లభ్యం అవుతుంది.  ఈ ఫోన్లను అమెజాన్, ఫ్లిఫ్ కార్ట్, శాంసంగ్ ఇండియా ఈ స్టోర్లలో లభ్యం. 

స్పెసిఫికేషన్లు:

*  బ్లాక్, బ్లూ, రెడ్ కలర్స్

*ఆండ్రాయిడ్ 10

*వన్ యూఐ 2.o 

*5,71 అంగుళాల హెచ్ డి+ఇన్ఫినిటీ వీ డిస్ ప్లే

* 3జీబీ/32

* స్నాప్ డ్రాగన్ 439

*వెనుక వైపున రెండు కెమేరాలు 13+2 ముందు వైపు 5 ఎంపీ కెమేరా

*4000 ఎంఎహెచ్ బ్యాటరీ

* ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం లేదు 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle