newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

శాంసంగ్ నుంచి మూడు కొత్త ప్రోడక్ట్ లు వచ్చాయ్..

11-10-201911-10-2019 12:53:56 IST
2019-10-11T07:23:56.727Z11-10-2019 2019-10-11T07:23:38.729Z - - 17-04-2021

శాంసంగ్ నుంచి మూడు కొత్త ప్రోడక్ట్ లు వచ్చాయ్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శాంసంగ్ ప్రీమియం ట్యాబ్స్ సిరీస్ లో కొత్త వెర్షన్ ను తీసుకొచ్చింది. ట్యాబ్ ఎస్ 6  పేరుతో విడుదల చేసిన ఈ ట్యాబ్ లో గెలాక్సీ ఎస్-పెన్ కూడా ఉంటుంది. ఇది 4జీ నెట్ వర్క్ ని కూడా సపోర్టు చేస్తుంది. దీంతోపాటు గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 ను కూడా తీసుకొచ్చింది.  దీంతోపాటు ఎల్ టీ ఈని సపోర్టు చేసే గెలాక్సీ వాచ్ ను కూడా తీసుకొచ్చారు.  

ట్యాబ్ ఎస్ 6

* గెలాక్సీ ట్యాబ్ ఎస్  6  లో క్వాల్ కోమ్ స్నాప్ డ్రాగన్  855 ప్రాసెసర్ ఉంటుంది. 

* 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఇస్తున్నారు.

* 10.5 అంగుళాల సూపర్ ఆమోలెడ్ డిస్ ప్లే అందిస్తున్నారు.

* నాలుగు ఏకేజీ  ట్యూన్డ్ స్పీకర్స్ ఉంటాయి.

* ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.

* దీంతోపాటు ట్యాబ్ అటాచ్ చేసుకునేలా మ్యాగ్నటిక్ ఫీచర్ తో స్టైలస్ పెన్ కూడా ఇస్తున్నారు.

* ఈ పెన్ ను సెల్ఫీ క్లిక్ బటన్ గాను, పేజీ స్క్రోలింగ్ కూడా వాడుకోవచ్చు

* వెనుకవైపు 13 ఎంపీ ప్రధాన కెమెరా, 5 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటాయి. దీంతో 123 డిగ్రీల వరకు వైడ్ యాంగిల్లో ఫొటోలు తీసుకోవచ్చు. 

* ముందువైపు సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరాను అందిస్తుననారు.

* 7040 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 15 వాట్ అడ్పాటివ్ ఫాస్ట్ ఛార్జర్ కూడా బాక్స్ తో ఇస్తున్నారు. 

* దీని ధర రూ. 59,990

గెలాక్సీ 4 జీ వాచ్

* 4 జీ నెట్వర్క్ తో దేశంలో లాంచ్ అయిన తొలి స్మార్ట్  వాచ్ ఇది.  ఈ సిమ్ తో దీనికి 4 జీ సదుపాయాన్ని తీసుకొచ్చారు. 

* బ్లూటూత్ ద్వారా ఈ వాచీ లోని పాటలు ఇయర్ ఫోన్ల ద్వారా వినొచ్చు. స్పాటిఫైలో ప్రస్తుతం ఈ తరహా ఆప్షన్ ఉంది.

* ఇందులో జీపీఎస్ సౌకర్యం కూడా ఉంది. దీంతోపాటు వివిధ రకాల ఎక్సర్ సైజ్ లను ఇది ట్రాక్ చేస్తుంది.

* 42 ఎంఎం, 46 ఎంఎం డయల్ సైజ్ తో ఈ వాచీ బంగారు రంగులో లభిస్తోంది.

* 42 ఎంఎం ధర రూ. 28,490. 46 ఎంఎం ధర 30,990. 

గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2

* లైట్ వెయిట్ డిజైన్ తో ఈ వాచీని రూపొందించారు. డయల్  చుట్టూ ఉన్న బెజల్స్ ని టచ్ ప్యాడ్ గా వాడుకోవచ్చు. 

* ఈ స్మార్ట్ వాచీ 39 రకాల వర్కవుట్లను సపోర్టు చేస్తుంది.

* ఇందులో మెరుగైన హార్ట్ రేట్ సెన్సర్ ఉంటుంది. 44 ఎంఎం వేరియంట్ ను మాత్రమే మన మార్కెట్ లో విడుదల చేశారు. 

* ఇందులో 340 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.  ఇందులో 4 జీబీ అంతర్గత మెమొరీ ఉంటుంది.

* ఇది  4 జీని సపోర్టు చేయదు. కేవలం వైఫై తోనే పని చేస్తుంది.

* స్టీల్ ఫినిష్ మోడల్ ధర రూ. 31,990. అల్యూమినియం  ఫినిష్ మోడల్ ధర రూ. 26,990

ఈ ప్రోడక్ట్ లన్నీ అమెజాన్, ఫ్లిప్ కార్ట్, శాంసంగ్ ఈ షాప్, శాంసంగ్ ప్రీమియం రిటైల్ స్టోర్స్ లో నేటి (అక్టోబరు 11) నుంచి దొరుకుతాయి. 

 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle