newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

శాంసంగ్ నుంచి కొత్త ఫోన్.. 7000 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో షాక్

23-08-202023-08-2020 17:53:31 IST
2020-08-23T12:23:31.733Z23-08-2020 2020-08-23T12:23:30.050Z - - 19-04-2021

శాంసంగ్ నుంచి కొత్త ఫోన్.. 7000 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో షాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ నుంచి మరో అద్భుతమైన ఫోన్ రాబోతోంది. ‘శాంసంగ్ గెలాక్సీ ఎం51’ పేరుతో రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన అతిపెద్ద బ్యాటరీని ఉపయోగించినట్టు సమాచారం. అలాగే, హోల్‌పంచ్ కటౌట్ సెల్ఫీ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. 

స్పెసిఫికేషన్ల విషయానికొస్తే 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 730 చిప్‌సెట్ ఉపయోగించిన ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 10 ఆధారిత శాంసంగ్ వన్ యూఐ 2.1 ఓఎస్‌తో పనిచేస్తుందని సమాచారం. 

అలాగే, వెనకవైపు 64 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో నాలుగు కెమెరాలు, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉందని తెలుస్తోంది. ఇందులో 6జీబీ, 8జీబీ ర్యామ్ వేరియంట్లు, 128జీబీ అంతర్గత మెమొరీ ఉన్నట్టు సమాచారం. శాంసంగ్ గెలాక్సీ ఎం 51 ధర, భారత్‌లో ఎప్పుడు లాంచ్ చేసేది వంటి వివరాలు తెలియాల్సి ఉంది.

కొద్ది రోజుల క్రితమే గెలాక్సీ ఎం 31 పేరిట అద్భుతమైన స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి  తెచ్చి ఆశ్చర్యపరిచిన శాంసంగ్ ఇప్పుడు గెలాక్సీ ఎం51 పేరుతో మరో సంచలనం సృష్టించింది. 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో శామ్ సంగ్ తీసుకొచ్చిన  గెలాక్సీ ఎం 31 ప్రత్యేకత ఏమిటంటే ఒకే మూమెంట్‌ని 10 రకాలుగా అంటే 7 పిక్చర్స్ మరియు 3 వీడియోలు కాప్చర్ చేసి సింగిల్ టేక్ ఫీచర్ వాడవచ్చు. 

ఏదైనా ఫోటో, వీడియో తీయాలంటే రెండు ఆప్షన్లు వాడుతున్న స్థితిని గెలాక్సీ ఎం 31 పూర్తిగా మార్చేసింది. MonsterShot 64 మెగాపిక్సెల్ ఇంటెల్ కామ్‌తో వస్తోన్న సింగిల్ టేక్ ఫీచర్ యూత్ ని ఇప్పటికే బాగా ఆకర్షిస్తోంది. చాలా రోజుల తర్వాత ఈ సూపర్ డివైస్ మార్కెట్ లోనికి వచ్చింది. 

7,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని చూసి నెటిజన్లు నోరు తెరిచేస్తుండగా వేగంగా చార్జి అయ్యే అధునాతన టెక్నాలజీని కూడా ఈ గెలాక్సీ ఎమ్51 స్మార్ట్ ఫోన్లో ఉండడం వినియోగదార్లును మరింతగా ఊరిస్తోంది. ఎమ్ 31 సీరీస్ ఫోన్‌కి 20 వేల రూపాయల ధరపెట్టగా, ఈ సరికొత్త ఎమ్51 సీరీస్ ఫోన్‌కి 30 వేలరూపాయల లోపు ధర ఉండవచ్చని భావిస్తున్నారు.

 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle