newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

శాంసంగ్ గెలాక్సీ నుంచి 64 ఎంపీ కెమెరా ఫోన్

28-09-201928-09-2019 11:31:45 IST
Updated On 28-09-2019 16:42:06 ISTUpdated On 28-09-20192019-09-28T06:01:45.328Z28-09-2019 2019-09-28T06:01:41.237Z - 2019-09-28T11:12:06.679Z - 28-09-2019

శాంసంగ్ గెలాక్సీ నుంచి 64 ఎంపీ కెమెరా ఫోన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొన్నాళ్ల వరకు ఫ్లాగ్ షిప్ మొబైల్స్ ను నమ్ముకున్న శాంసంగ్ తర్వాత రూటు మార్చింది. బడ్జెట్లో మొబైల్స్ తీసుకొచ్చినా స్పెసిఫికేషన్ల విషయంలో కాస్త అటుఇటుగా ఉండటంతో యూజర్లు అంతగా పట్టించుకోలేదు. దీంతో  బడ్జెట్ బ్రాకెట్ కు తగ్గట్టుగా మొబైల్స్ రూపొందిస్తూ వచ్చింది. దీంతో శాంసంగ్ మళ్లీ పుంజుకుంది దీంతో ఇప్పుడు రూ.30 వేల బ్రాకెట్ మీద కన్నేసింది. భారత మార్కెట్‌లోకి ‘A’ సిరీస్‌లో మరో ఫోన్‌ను విడుదల చేసింది. గెలాక్సీ 70s పేరిట ఫోన్‌ తీసుకొచ్చింది. ఇందులో తొలిసారిగా 64 ఎంపీ కెమెరా అందిస్తున్నారు.  గెలాక్సీ A70కి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

శాంసంగ్‌ గెలాక్సీ A70s రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమొరీ  వేరియంట్ ధర రూ.28,999.  8జీబీ ర్యామ్, 128జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్‌ ధర రూ.30,999. ఈ రెండూ సెప్టెంబర్‌ 28 నుంచి అమ్మకానికి వస్తున్నాయి.  శాంసంగ్‌ ఒపెరా హౌస్‌, శాంసంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్లతోపాటు ఇతర ఆఫ్ లైన్ స్టోర్స్ లో అమ్మకాలు నిర్వహిస్తారు. ప్రిజమ్‌ క్రష్‌ రెడ్‌, ప్రిజమ్‌ క్రష్‌ బ్లాక్‌, ప్రిజమ్‌ క్రష్‌ వైట్‌ రంగుల్లో ఈ మొబైల్ లభిస్తుంది.  లాంచ్‌ ఆఫర్‌ లో భాగంగా జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు ప్రత్యేక డేటా ఆఫర్లు ఇస్తున్నారు. 

శాంసంగ్‌ గెలాక్సీ A70s  ఆండ్రాయిడ్‌ 9 ‘పై’ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత వన్‌ యూఐతో పనిచేస్తుంది. 6.7 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది.  స్నాప్‌డ్రాగన్‌ 675 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 4,500ఎంఏహెచ్‌ బ్యాటరీతో రానున్న ఈ మొబైల్   25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ ఫోన్‌లో శాంసంగ్‌ తొలిసారిగా 64 ఎంపీ కెమెరాను ఉపయోగించింది. దీంతో పాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 5 ఎంపీ కెమెరా ఉన్నాయి.  32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీతో వస్తోంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌తో ఈ ఫోన్‌ వస్తోంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle