newssting
BITING NEWS :
*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా. 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపు *అమరావతిలో హైటెన్షన్.. అసెంబ్లీ ముట్టడికి టీడీపీ ప్లాన్*చంద్రబాబు ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదు. రాజధాని రైతులకు జగన్ కౌలు కూడా ఇచ్చారు. సామాన్యులకు రాజధానితో పనేముంది? అమరావతిలో పోలీసులకు చంద్రబాబు నీళ్లు కూడా ఇవ్వకుండా చేస్తున్నారు-హోంశాఖ మంత్రి సుచరిత *ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం *బెజవాడలో నేతలకు పోలీసుల నోటీసులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, ఎంపీ కేశినేని నానికి నోటీసులు. ఎమ్మెల్సీలు బుద్దా, రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య సహా పలువురు టీడీపీ నేతలకు నోటీసులు. వామపక్షాలు, జేఏసి నేతలకు కూడా పోలీసుల నోటీసులు *రేపటి కేబినెట్, అసెంబ్లీకి రహస్యంగా సిద్ధమవుతోన్న నోట్స్, బిల్లులు. గుంభనంగా సాగుతున్న ప్రభుత్వ చర్యలు*తెలంగాణలో ఊపందుకున్న మునిసిపల్ పోరు *తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఒకేగూటి పక్షులు. తెరాస కు ఓటు వేస్తె ఎంఐఎం కు ఓటు వేసినట్టే. కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి. కేంద్రం నిధులపై కేటీఆర్ చర్చకు సిద్ధమా ? - లక్ష్మణ్ *విశాఖ: ఓట్ల కోసం గాజువాక.. రాజకీయాలకు అమరావతి కావాల్సి వచ్చిందా? గాజువాక ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి-మంత్రి అవంతి శ్రీనివాస్

శాంసంగ్ ఎస్ 20, ఎస్20 ఆల్ట్రా, ఎస్ 20 ప్లస్..ఫ్లాగ్ షిప్ ఫోన్స్

02-01-202002-01-2020 19:16:00 IST
2020-01-02T13:46:00.228Z02-01-2020 2020-01-02T13:45:57.675Z - - 20-01-2020

శాంసంగ్ ఎస్ 20, ఎస్20 ఆల్ట్రా, ఎస్ 20 ప్లస్..ఫ్లాగ్ షిప్ ఫోన్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శాంసంగ్ మొబైల్స్ రంగంలో దూసుకుపోతున్న కంపెనీ. యువత ఆలోచనలకు తగ్గట్టుగా కంపెనీ నయా మోడల్స్ విడుదలచేస్తోంది. తాజాగా శాంసంగ్‌ నెక్స్ట్ జనరేషన్ గెలాక్సీ ప్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదలచేయబోతోంది.  ఫిబ్రవరి 11 న అమెరికాలోనియ శాన్ ఫ్రాన్సిస్కోలో జరగనున్న కార్యక్రమంలో ఈ ఫోన్ విడుదల చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది.

ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్ ని ‘ఎస్ 20’  పేరుతో లాంచ్‌ చేయనుంది. ఎస్ 11 ఇ, ఎస్ 11 ,ఎస్ 11ప్లస్‌ కు బదులు, గెలాక్సీ ఎస్ 10 సిరీస్‌కు కొనసాగింపుగా ఎస్ 20, ఎస్ 20 ప్లస్‌, ఎస్ 20 అల్ట్రా సిరీస్‌ను లాంచ్‌ చేయనుందని తెలుస్తోంది. ఇప్పటికే శాంసంగ్ ఫ్లాగ్ షిప్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే వీటి ధరల సంగతి ఇంకా ప్రకటించలేదు. 

శాంసంగ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ .. గెలాక్సీ ఎస్ 20 స్పెసిఫికేషన్లు:

*ఎక్సినోస్ 990  ప్రాసెసర్‌

*స్నాప్‌డ్రాగన్ 865 

*  ఫోన్ కు 6.2-అంగుళాల స్క్రీన్‌

*ఎస్ 20 ప్లస్ ఫోన్ కు 6.7అంగుళాల స్క్రీన్‌

* గెలాక్సీ 20 అల్ట్రాకు 6.9 అంగుళాల  డిస్‌ప్లే

*108 ఎంపీ మెయిన్‌గా, క్వాడ్‌  కెమెరాఫీచర్‌

* ఎస్ 20కి 4000ఎంఏహెచ్‌బ్యాటరీ

*ఎస్ 20 ఆల్ట్రాకి 4400ఎంఏహెచ్‌బ్యాటరీ

*ఎస్ 20 ఫ్లస్ కి 5000 ఎంఏహెచ్‌బ్యాటరీ వుంటుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle