శాంసంగ్ 5జీ ఫోల్డబుల్ ఫోన్‌ని టీజ్ చేశారు!
03-11-201903-11-2019 10:43:59 IST
2019-11-03T05:13:59.490Z03-11-2019 2019-11-03T05:13:20.937Z - - 17-04-2021

చైనాలో 5జీ సర్వీసులు ఇటీవల స్టార్ట్ అయ్యాయి. దీంతో మొబైల్ సంస్థలు ఇక 5జీ మొబైల్స్‌పై దృష్టిసారించాయి. ఒక్కొక్కటిగా 5జీ ఫోన్లు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. కొన్ని అయితే రేపోమాపో తీసుకొచ్చేలా ఉన్నాయి. అయితే కేవలం 5జీకి మాత్రమే ఫిక్స్ అయిపోకుండా దానికి అదనపు హంగులు జోడించి తీసుకొస్తున్నాయి. అలా శాంసంగ్ నుంచి త్వరలో శాంసంగ్ డబ్ల్యూ20 అనే 5 జీ ఫోన్ రాబోతోంది. ఈ నెలలో చైనాలో దీనిని లాంచ్ చేస్తారని సమాచారం. దీనికి సంబంధించి ఓ పోస్టర్ శాంసంగ్ ఇటీవల టీజ్ చేసింది. దాని ప్రకారం చూస్తే ఇది నిలువుగా ఫోల్డ్ చేయగలిగే ఫోన్. మొన్నీమధ్య అంతర్జాలంలో హల్చల్ చేసి వర్టికల్ ఫోల్డింగ్ ఫోన్ ఈ డబ్ల్యూ20 అని అర్థమవుతోంది. శాంసంగ్ నుంచి వచ్చి డబ్ల్యూ 2019కి డబ్ల్యూ20ని సక్సెసర్‌గా చెప్పొచ్చు. డబ్ల్యూ 2019లో ట్రెడిషనల్ ఫ్లిప్ డిజైన్ విత్ కీప్యాడ్ ఉంటుంది. అయితే డబ్ల్యూ 20లో సెకండరీ స్క్రీన్ గురించి ఎలాంటి సమాచారం లేదు. ఫోన్‌ను మడతపెట్టాక బయటవైపు సెకండరీ స్క్రీన్ ఇస్తారని కొందరు, ఇవ్వడం లేదని కొందరు టెక్ నిపుణులు చెబుతున్నారు. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. శాంసంగ్ ఫోల్డ్‌లో వాడిన స్క్రీన్‌నే ఈ మొబైల్లో కూడా వాడతారని సమాచారం. ఈ మొబైల్ అనేక బాలారిష్టాలు దాటుకొని ఇటీవల మార్కెట్లోకి వచ్చిన విషయం తెలిసిందే. రూ.1.65 లక్షల ధరతో లిమిటెడ్ వెర్షన్‌గా వచ్చిన ఈ మొబైల్‌కు మన దేశంలోనూ మంచి ఆదరణ లభించిందని శాంసంగ్ చెబుతోంది. ఈ లెక్కన చూస్తే డబ్ల్యూ 20 ధర సుమారు ₹రెండు లక్షల వరకు ఉంటుందని సమాచారం. శాంసంగ్ డబ్ల్యూ సిరీస్ మొబైళ్లను చైనాలోనే లాంచ్ చేస్తూ వస్తోంది. దీంతో ఈ కొత్త 5జీ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా తీసుకొస్తారో లేదా చూడాలి. అయితే 5జీ ఫోన్ కాబట్టి డబ్ల్యూ 20ని ప్రపంచవ్యాప్తంగా తీసుకొస్తారని చైనా సమాచారం. ఎలాగూ ఫోల్డబుల్ ఫోన్స్ మెయిన్ స్ట్రీమ్‌లో ముందుండాలని శాంసంగ్ ఎప్పటి నుంచో అనుకుంటోంది. దానికి డబ్ల్యూ 20ని కేంద్రంగా చేసుకుంటుందేమో చూడాలి. ఈ మొబైల్ లాంచ్ డేట్‌ని శాంసంగ్ ఇంకా ప్రకటించలేదు. మరోవైపు మోటో నుంచి రాబోతున్న మోటో రేజర్ లాంచ్ డేట్ కూడా ఇంకా ఫిక్స్ కాలేదు. మరికొద్ది రోజుల్లోనే దీనిపై స్పష్టత రానుంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా