newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

శాంసంగ్‌ కొత్త ఫోల్డింగ్‌ ఫోన్లు తీసుకొస్తోంది...

30-10-201930-10-2019 10:59:57 IST
2019-10-30T05:29:57.141Z30-10-2019 2019-10-30T05:29:54.361Z - - 11-04-2021

శాంసంగ్‌ కొత్త ఫోల్డింగ్‌ ఫోన్లు తీసుకొస్తోంది...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మడత పెట్టే ఫీచర్‌తో ఇటీవల సరికొత్త ఫోన్లు తీసుకొచ్చిన శాంసంగ్‌ మరో స్టైల్‌తో రాబోతోంది. ప్రస్తుతం శాంసంగ్‌ అడ్డంగా మడతపెట్టగలిగే మొబైల్‌ను తీసుకొచ్చింది. త్వరలో నిలువుగా మడతపెట్టగలిగే మొబైల్‌ను లాంచ్‌ చేయబోతోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఆన్‌లైన్‌లో సందడి చేస్తున్నాయి.  ఇటీవల జరిగిన శాంసంగ్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌ (ఎస్‌డీసీ) 19లో దీనికి సంబంధించి కొన్ని అంశాలతో టీజ్‌ చేసింది. మోటో గత కొద్ది రోజులుగా తీసుకొస్తామని చెబుతున్న రేజర్‌ ఫోన్‌ స్టైల్‌లోనే ఇదీ కనిపిస్తోంది. ఇంకా ఇదేం కొత్త స్టైల్‌ కూడా కాదు. స్మార్ట్‌ ఫోన్ల రాకకు ముందు ఇలాంటి స్టైల్‌ ఫోన్లు చాలానే వచ్చాయి. 

గెలాక్జీ ఫోల్డ్‌ ఫోన్ల విషయంలో ఇప్పటివరకు వాడుతున్న హారిజాంటల్‌ ఫోల్డ్‌ స్థానంలో వెర్టికల్‌ ఫోల్డ్‌ రాబోతోంది. గతంలో ఫోల్డ్‌ ఫోన్‌ అన్‌ఫోల్డ్‌ చేస్తే ట్యాబ్‌లా మారుతుంది. కొత్త మొబైల్‌ అయితే పెద్ద ఫోన్‌గా ఎక్కువ పొడవుతో కనిపిస్తుంది. దీనికి SM-F700F కోడ్‌ నేమ్‌ పెట్టారు. ఇందులో 256 జీబీ అంతర్గత మెమొరీ ఉండబోతోంది. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇప్పటికే మొదలైందని తెలుస్తోంది.  ఇలాంటి ఫోన్‌ ఒకటి రాబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు శాంసంగే నేరుగా ప్రకటించేసింది. ఈ మొబైల్‌కు శాంసంగ్‌ డబ్ల్యూ 20 5జీ అనే పేరు పెడతారనీ సమాచారం. 

హారిజాంటల్‌ స్టైల్‌ ఫోల్డ్‌ విషయంలో శాంసంగ్‌ చాలా ఇబ్బందులు పడింది. తొలుత ఓసారి అఫీషియల్‌ లాంచ్‌ చేసి చాలా సమస్యలు ఫేస్‌ చేసింది. తర్వాత వాటిని ఫిక్స్‌ చేసి మరో వెర్షన్‌ తీసుకొచ్చింది. కొత్త వెర్షన్‌కు మన దేశంలోనూ మంచి స్పందన వచ్చింది. మన దేశంలో ఆన్‌లైన్‌ పెట్టిన వెంటనే మొబైల్స్‌ అవుట్‌ ఆఫ్‌ స్టాక్‌ అవుతున్నాయని శాంసంగ్‌ ఇటీవల ప్రకటించింది. అయితే తక్కువ మొత్తంలో స్టాక్‌ పెడుతున్నారనే మాటలూ వినిపిస్తున్నాయి. మరి కొత్త ఫోల్డ్‌ విషయంలో శాంసంగ్‌ ఎన్ని మార్పులు, జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి. తొలి మొబైల్‌ విషయంలో పడ్డ ఇబ్బందులు ఈ సారి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Image result for samsung ready to bring new vertical foldable mobile

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle