శాంసంగ్ ఎ51లో మస్తు ఫీచర్లున్నాయ్ తెలుసా?
07-11-201907-11-2019 09:41:43 IST
Updated On 07-11-2019 15:00:06 ISTUpdated On 07-11-20192019-11-07T04:11:43.110Z07-11-2019 2019-11-07T04:11:35.640Z - 2019-11-07T09:30:06.969Z - 07-11-2019

‘ఎ’ సిరీస్‌లో వరుస మొబైల్స్ లాంచ్ చేస్తామని శాంసంగ్ చాలా రోజుల క్రితమే ప్రకటించింది. అందుకు తగ్గట్టే ఎ10తో మొదలుపెట్టి ఎ80 వరకు వరుసగా లాంచ్ చేసింది. ఆ తర్వాత చివర ‘ఎస్’ జోడించి మరికొన్ని మొబైల్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్‌లో మరికొన్ని ఫోన్లు రాబోతున్నాయి. వాటిలో ఎ51 ఒకటి. కొన్ని రోజుల క్రితం దీని గురించి గీక్‌బెంచ్ స్కోర్ బయటికొచ్చింది. తాజాగా మరికొన్ని వివరాలు తెలిశాయి. త్వరలోనే ఈ మొబైల్‌ను ప్రపంచ మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. ఎ51 గతంలో వచ్చిన ఎ50 ఫీచర్లకు అప్‌గ్రేడ్‌గా ఉంటుందని కొత్తగా చెప్పక్కర్లేదు. ధర కూడా అదే స్థాయిలో పెడతారనీ తెలుస్తోంది. ఎ50ని రూ.20,999 ధరతోను, ఎ50ఎస్‌ను రూ.18,490 ధరతోను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎ51 సుమారు రూ.22,000 ధరలో మార్కెట్లోకి తీసుకొస్తారని సమాచారం. ఇందులో యు షేప్‌లో నాచ్‌డిస్‌ప్లే ఉంటుంది. ఎ50 మొబైల్ కంటే కాస్త పలుచగా ఉండబోతోంది. నొయిడా ప్లాంట్‌లో ఇటీవల వీటి ఉత్పత్తిని ప్రారంభించారట. అంటే మరికొన్ని రోజుల్లోనే ఈ మొబైల్ లాంచ్ ఉంటుందని సమాచారం. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే... ఎ51లో 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ -యు షేప్ ఆమోలెడ్ స్క్రీన్ ఉంటుంది. ఇందులో 48 ఎంపీ ప్రధాన కెమెరా ఇస్తారు. ముందువైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు. అయితే ఈ మొబైల్లో వెనుకవైపు నాలుగు కెమెరాలు తీసుకొస్తారనే వార్తలూ వినిపిస్తున్నాయి. వాటిలో 12 ఎంపీ వైడ్ యాంగిల్ సెన్సర్ ఒకటి, 12 ఎంపీ టెలీఫొటో లెన్స్ ఒకటి ఉంటాయి. ఈ రెండూ కాకుండా 5 ఎంపీ డెప్త్ సెన్సర్‌ను కూడా అందిస్తారని తెలుస్తోంది. ఈ మొబైల్లో యూఎస్బీ టైప్ - సి పోర్టు ఉంటుంది. 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఇస్తున్నారు. మైక్రో ఎస్డీ కార్డుతో అదనపు స్టోరేజీ ఫీచర్ కూడా ఉంటుంది. ఇందులో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నట్లు సమాచారం. శాంసంగ్ కొత్తగా డెవలప్ చేస్తున్న వన్ యూఐ 2.0 తో ఈ మొబైల్ పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా దీనిని తయారు చేశారు.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
11 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా