newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

శాంసంగ్‌ని ‘మడతబెట్టిన’ రాయొలే

03-11-201803-11-2018 16:28:49 IST
Updated On 03-11-2018 16:28:49 ISTUpdated On 03-11-20182018-11-03T10:58:49.580Z03-11-2018 2018-11-03T10:58:49.580Z - 2018-11-03T10:58:49.582Z - 03-11-2018

శాంసంగ్‌ని ‘మడతబెట్టిన’ రాయొలే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు శాంసంగ్ సంస్థ చాలాకాలం నుంచి ప్రయత్నిస్తోంది. ఓసారి ప్రెస్‌మీట్ నిర్వహించి మరీ డెమో కూడా చూపించారు. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కానీ... ఏమైందో శాంసంగ్ సంస్థ ఇప్పటికీ దాన్ని మార్కెట్‌లోకి తీసుకురాలేకపోయింది. ఇంతలో ఈ సంస్థకి షాకిస్తూ చైనా కంపెనీ రాయొలే కార్పొరేషన్ తొలి ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. శాంసంగ్‌లాగా ఎలాంటి హడావుడి చేయకుండా మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ‘ఫ్లెక్స్‌పై’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ చూడ్డానికి ట్యాబ్‌లా కనిపించినా... మధ్యలోకి ఫోల్డ్‌ చేసి వాడుకునేలా దీన్ని రూపొందించారు. దీని వెనుక భాగంలో రెండు కెమెరాలు అమర్చబడి ఉంటాయి. ఫోన్‌ని మడతబెట్టినప్పుడు... ఒక కెమెరా సెల్ఫీ కెమెరాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు... ఈ ఫోన్‌ని మడిచినప్పుడు డ్యుయెల్ స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌లా కనిపిస్తుంది.

7.8 అంగుళాల పరిమాణంలో ఉన్న ఈ ఫోన్‌లో 20మెగాపిక్సెల్‌ టెలిఫొటో లెన్స్‌తో పాటు 16ఎంపీ వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ డ్యుయల్‌ కెమెరాలు ఉన్నాయి. దాదాపు 2లక్షల సార్లు పరీక్షించి ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేశామని... సాంప్రదాయ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే తమ ఫోల్డబుల్‌ ఫోన్లు వినియోగదారులకు విభిన్నమైన అనుభవాన్ని అందిస్తాయని రాయొలే సంస్థ వెల్లడించింది. 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ ఫోన్‌ ధర1,318 డాలర్లు, (సుమారు రూ.94,790) 256జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర 1,469 డాలర్లుగా (లక్షా డెబ్భై వేల రూపాయలు) నిర్ణయించింది. ప్రస్తుతం బీజింగ్‌లో అందుబాటులోకొచ్చిన ఈ ఫోన్‌లు... భారత మార్కెట్‌లోకి రావడానికి కొంచెం సమయం పడుతుంది. మొబైల్ మార్కెట్‌లో దిగ్గజంగా పరిగణించబడుతున్న శాంసంగ్‌తో పాటు ఎల్‌జీ, హువావే లాంటి సంస్థలు ఫోల్డబుల్ ఫోన్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు నానాతంటాలు పడుతుంటే... అనుహ్యంగా రాయొలే ఎంట్రీ ఇచ్చి అందరినీ షాక్‌లో ముంచెత్తింది.

ఈ ఫోన్ ఫీచర్లు:
7.8 అంగుళాల డిస్‌ప్లే
క్వాల్కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8150 ప్రాసెసర్‌
6జీబీ / 8జీబీ ర్యామ్‌,
128జీబీ/256జీబీ/512జీబీ  స్టోరేజ్‌
3800 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   2 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle