వ్యంగ్య కార్టూనిస్ట్ జాన్ టెన్నిల్పై గూగుల్ డూడుల్
28-02-202028-02-2020 16:42:57 IST
Updated On 28-02-2020 17:53:16 ISTUpdated On 28-02-20202020-02-28T11:12:57.196Z28-02-2020 2020-02-28T11:12:55.617Z - 2020-02-28T12:23:16.241Z - 28-02-2020

ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ప్రతిరోజూ ఏదో ఒక అంశం,వ్యక్తిపై డూడుల్ రూపొందిస్తూ వుంటుంది. తాజాగా వ్యంగ్య కార్టూనిస్ట్ ‘సర్ జాన్ టెన్నిల్ కు ఘన నివాళి అర్పించింది. ఆయన 200వ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేకంగా డూడుల్ రూపొందించింది. రాజకీయ వ్యంగ్య చిత్రాలతో 19వ శతాబ్దపు చిత్రకారుల్లో ప్రత్యేకమైన గుర్తింపు పొందారు జాన్ టెన్నిల్. విఖ్యాత ‘పంచ్’ వీక్లీ మ్యాగజైన్‌కు సుమారు 50 ఏళ్లు కార్టూనిస్టుగా పని చేశారు. ఒక పత్రికకు అంతకాలం కార్టూనిస్ట్ గా పనిచేయడం చాలా అరుదైన విషయం. జాన్ టెన్నిల్ ప్రతిభకు ప్రశంసలు లభించాయి. బ్రిటన్ ప్రభుత్వం నైట్ హుడ్ అవార్డుతో సత్కరించింది. లెవీస్ కార్లోస్ రచించిన ‘ఎలీస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్లాండ్’, ‘త్రో ది లుకింగ్ గ్లాస్ అండ్ వాట్ ఎలీస్ ఫౌండ్ ధేర్’ పుస్తకాలను తన చిత్రాలతో ఎంతో ఆసక్తికరంగా మార్చారు. టెన్నిల్ ఇంగ్లాండ్ లో 1820లో ఫిబ్రవరి 28న జన్మించారు. 20ఏళ్ల వయస్సులో కంటి చూపు పోగొట్టుకున్నారు. 1850లో సొసైటీ ఆఫ్ బ్రిటిష్ ఆర్టిస్ట్స్ ఎగ్జిబిషన్లో ఆయన ఆయిల్ పెయింటింగ్ ప్రదర్శనలో అవకాశం పొందింది. లూయిస్ కారోల్ గా కలం పేరు పెట్టుకున్న ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ చార్లెస్ డాడ్స్ సన్ న్యూ బుక్ ‘Alice’s Adventures in Wonderland’ కి ఇల్లస్ట్రేషన్స్ వేశారు జాన్ టెన్నిల్. ఈ బుక్ 1864లో విడుదలైంది. వీటికి ఎంతో గుర్తింపు వచ్చింది. కారోల్ మరో పుస్తకానికి ఇల్లస్ట్రేషన్స్ వేసే అవకాశం దక్కింది. టెన్నిల్ వేసిన అనేక వ్యంగ్యచిత్రాలు చిన్నారుల్ని, పెద్దల్ని ప్రముఖుల్ని కూడా ఆకట్టుకున్నాయి. అయితే ఈ లోపం ఆయన ప్రతిభకు ఆటంకం కలిగించలేదు. అనతికాలంలోనే మంచి కార్టూనిస్టుగా,వ్యంగ్య చిత్రాలు, కేరికేచర్లు గీయడంలో ఆయన ప్రత్యేకతను చాటుకున్నారు. 1914లో ఫిబ్రవరి 25న 93 ఏళ్ల వయస్సులో జాన్ టెన్నిల్ కన్నుమూశారు. ఆయనకు సంబంధించిన వ్యంగ్యచిత్రాలను గూగుల్ డూడుల్ టీం ప్రత్యేకంగా రూపొందించింది. ఈ డూడుల్ అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రతి రోజు ఏదో ఒక సందర్భాన్ని అనుసరించి గూగుల్ టీం డూడుల్ రూపొందించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా