newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

వోవైఫై వస్తోందట... అదేంటో తెలుసా?

03-12-201903-12-2019 10:40:23 IST
2019-12-03T05:10:23.705Z03-12-2019 2019-12-03T05:10:17.847Z - - 06-12-2019

వోవైఫై వస్తోందట... అదేంటో తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఫోన్‌ కాల్‌ మాట్లాతుండగా కట్‌ అయిపోతే ఎక్కడలేని చిరాకు వస్తుంది. ఇండియాస్‌ బెస్ట్‌ నెట్‌వర్క్‌ అంటారు... ఇలా కట్‌ అవుతోంది ఏంటి అంటారు. త్వరలో ఇలాంటి ఇబ్బంది రాకపోవచ్చు. అదేంటి సంస్థలు కాల్స్‌ రేటుతో పాటు ఇలాంటి సమస్యలు కూడా తగ్గిస్తున్నాయా అనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. మీరు ఇంట్లో వాడుకుంటున్న వైఫైతోనే కాల్స్‌ చేసుకునే సాంకేతిక సిద్ధం చేస్తున్నారు. వైఫైతో వాయిస్‌ కాల్‌లు మాట్లాడేలా మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు  ప్రయత్నాలు చేస్తున్నారు.  దీనిని ‘వోవైఫై’ అంటారు. 

వోవైఫై అంటే ‘వాయిస్‌ ఓవర్‌ వైఫై’. అంటే వైఫైతో వాయిస్‌ ఫోన్‌ కాల్స్‌ మాట్లాడటం అన్నమాట. మీరున్న ప్రాంతంలో మొబైల్‌ నెట్‌వర్క్‌ కవరేజీ ఎక్కువగా లేకున్నా, సిగ్నల్‌లో ఫ్లక్చువేషన్స్‌ ఉన్నా వైఫై కనెక్టివిటీ ఉంటే దాంతోనే కాల్స్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెరికాలో వోవైఫై సాంకేతిక అందుబాటులో ఉంది.

వోవైఫై కోసం కొత్తగా యాప్స్‌ ఏవీ డౌన్‌లోడ్‌ చేసుకోనక్కర్లేదు. మీ మొబైల్‌కు వైఫై కనెక్షన్‌ ఉంటే చాలు. మీ ఫోన్‌లో నెంబరును డయల్‌ చేసి కాల్స్‌ చేసుకోవచ్చు. ఆ సమయంలో మీ మొబైల్‌లో నెట్‌వర్క్‌ కవరేజీ తక్కువా ఉంటే  వోవైఫై ఆధారంగా కాల్‌ కొనసాగుతుంది. అంటే ఈ సర్వీసు అందుబాటులోకి వస్తే వాట్సాప్‌, స్కైప్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్లతో వాయిస్‌ కాల్స్‌ చేసినట్లుగా వోవైఫైతో కాల్స్‌ చేసుకోవచ్చు. 

మొబైల్‌ నెట్‌వర్క్‌ ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్నప్పుడు కాల్స్‌ కనెక్ట్‌ అవ్వడం ఇబ్బందిగా ఉంటుంది.  కొన్నిసార్లు కాల్స్‌ కలిసినా మీ ప్రమేయం లేకుండానే వాటంతటవే కట్‌ అవుతుంటాయి.  కొన్నిసార్లు కనెక్ట్‌ అయినా ఒకరి వాయిస్‌ మాత్రమే వినిపిస్తుంది. ఇంకోసారి ఒకరికి కాల్స్‌ చేస్తే వేరెవరో కాల్‌లోకి వచ్చి మాట్లాడేస్తుంటారు. వోవైఫై రాకతో ఈ సమస్యలు మొత్తం తొలగిపోతాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. 

అయితే ప్రస్తుతం వైఫై కేవలం నగరాలు, పట్టణాలకు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో ఈ సర్వీసులు దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడం ప్రస్తుతానికి అంత సులభం కాదు. ప్రయోగాత్మకంగా త్వరలో పెద్ద నగరాల్లో తీసుకొస్తారని తెలుస్తోంది. 

Image result for indian mobile operators trying to launch vowifi in india


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle