వొడాఫోన్ సెన్సేషనల్ ప్లాన్... అదొక్కటే మైనస్
12-02-201912-02-2019 18:51:07 IST
2019-02-12T13:21:07.650Z12-02-2019 2019-02-12T13:21:05.177Z - - 11-04-2021

‘జియో’ దెబ్బకు ఇతర టెలికాం సంస్థలు ఎలా కుప్పకూలాయో అందరికీ తెలుసు! సంవత్సర కాలంపాటు ఫ్రీగా ఫోన్ కాల్స్, డేటాలతో పాటు ఇతర సర్వీసులు ఇవ్వడం... ఆ తర్వాత అతి తక్కువ ధరలకే అమోఘమైన ప్లాన్స్ అందుబాటులోకి తీసుకురావడంతో... ఇతర సంస్థలు కుదేలైపోయాయి. ఇక అప్పట్నుంచి తిరిగి పుంజుకోవడానికి నానాతంటాలు పడుతూనే ఉన్నాయి. జియో తరహాలోనే ప్లాన్స్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయి. కొన్ని సంస్థలపై ఎక్కువ ఆర్థికభారం పడడంతో... విలీనం బాట పట్టాయి. ఇందులో భాగంగానే ఐడియా, వొడాఫోన్‌లో చేతులు కలిపాయి. ఈ రెండు సంస్థలు జతకట్టినప్పటి నుంచి తమ యూజర్ల కోసం అనూహ్యమైన ప్లాన్స్ తెస్తున్నాయి. తాజాగా వొడాఫోన్ మరో సంచలన ప్లాన్ ప్రకటించింది. ప్రత్యర్థి కంపెనీల్ని ధీటుగా దెబ్బకొట్టేందుకు రూ.351 ప్రీపెయిడ్ ప్లాన్‌ని తీసుకొచ్చింది. ఇందులో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందొచ్చు. ఇక్కడివరకూ బాగానే ఉంది... ఈరోజుల్లో అందరూ అలవాటు పడిపోయిన డేటా ఆఫర్‌ని మాత్రం వొడాఫోన్ ఈ ప్లాన్‌లో ఇవ్వడం లేదు. అంతేకాదు... కేవలం 56 రోజుల వాలిడిటీ పెట్టడం మరో బ్లండర్. ఓవైపు జియో రూ.399కే 84 రోజుల వాలిడిటీతో డేటా, ఫోన్‌కాల్స్, ఎస్ఎమ్ఎస్లు అందిస్తుంటే... వొడాఫోన్ డేటా లేకుండా 56 రోజులే వాలిడిటీ విధించడం ఆశ్చర్యకరం. మరి... ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా