newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వైరల్‌ వీడియో: ‘హువావే మేట్‌ ఎక్స్‌’ అన్‌బాక్సింగ్‌

18-10-201918-10-2019 10:30:26 IST
Updated On 18-10-2019 10:30:51 ISTUpdated On 18-10-20192019-10-18T05:00:26.547Z18-10-2019 2019-10-18T05:00:24.550Z - 2019-10-18T05:00:51.548Z - 18-10-2019

వైరల్‌ వీడియో: ‘హువావే మేట్‌ ఎక్స్‌’ అన్‌బాక్సింగ్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాబోయే రోజులు ఫోల్డింగ్‌ మొబైల్స్‌వే అని అందరూ అంటున్నారు. కానీ అగ్ర సంస్థలు మాత్రం ఫోల్డింగ్‌ ఫోన్‌ తీసుకురావడానికి నానా తంటాలు పడుతున్నాయి. రెండు నెలల క్రితం శాంసంగ్‌ నుంచి ఓ మడతపెట్టే ఫోన్‌ వచ్చింది. అఫీషియల్‌గా లాంచ్‌ చేసి టెస్టింగ్‌ కోసం కొంతమందికి, రివ్యూల కోసం కొంతమందికి పంపించారు. ఆ సమయంలో వాటిలో చాలా సమస్యలు తలెత్తి అమ్మకాలు మొదలుపెట్టలేదు. ఇటీవల మళ్లీ రెండోసారి వాటి అమ్మకాలు మొదలెట్టారు. ఇప్పుడు సేల్స్‌ బాగున్నాయి.  ఈ ధైర్యంతో హువావే కూడా రంగంలోకి దిగింది. చాలా రోజులుగా హువావే ఫోల్డింగ్‌ ఫోన్‌ మీద వర్క్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో దాన్ని బయటకు తీసుకొస్తుందని తెలుస్తుంది. 

‘మేట్‌ ఎక్స్‌’ పేరుతో  హువావే ఓ ఫోల్డింగ్‌ మొబైల్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి హువావే కొన్ని ఫొటోలు, కాస్త సమాచారం కూడా ఇచ్చింది. ఇప్పుడు దీని అన్‌బాక్సింగ్ వీడియో ఒకటి అంతర్జాలంలో హల్‌చల్‌ చేస్తోంది. దీని బట్టి చూస్తే మొబైల్‌కు సంబంధించి కొన్ని అంశాలు తెలుస్తున్నాయి. మేట్‌ ఎక్స్‌ను తెరిచినపుడు ట్యాబ్‌ పరిమాణంలో స్క్రీన్‌ ఉంటుంది. మడతబెట్టినపుడు సాధారణ స్మార్ట్‌ ఫోన్‌లా సన్నగా ఉంటుంది. ఫోన్‌ను మడతబెట్టి, తిరిగి తెరిచేందుకు ఒక చిన్నపాటి బటన్‌ను అమర్చారు. 

మొబైల్‌ డిస్‌ ప్లే తెరిచి ఉంచినప్పుడు 8 అంగుళాలు, మడతపెట్టినప్పుడు 6.6 అంగుళాలు ఉంటుంది. ఫోన్‌ ఫోల్డింగ్‌ చేసినప్పుడు ఉంచడానకి ఒక పౌచ్‌ను కూడా తీసుకొస్తున్నారు.  ఈ మొబైల్‌ బాక్స్‌లోనే ఈ పౌచ్‌ను అందిస్తున్నారు. ఇక ఫీచర్ల సంగతి చూస్తే... ఇది  ఆండ్రాయిడ్‌ 9 ‘పై’ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుందని సమాచారం.  4,500ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండొచ్చు.  55 వాట్‌ సూపర్‌ ఛార్జ్‌ సౌకర్యం ఉంటుంది. 

డిస్‌ప్లే వెనకవైపున మూడు కెమెరాలు ఇచ్చారు. స్క్రీన్‌ ఫోల్డ్‌ చేసినప్పుడు ఇవి ఫ్రంట్‌  కెమెరాలుగా పని చేస్తాయి. వీటిలో వైడ్ యాంగిల్ లెన్స్‌తో 40 ఎంపీ కెమెరా ఉంటుంది. దాంతో పాటుగా అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌తో 16 ఎంపీ కెమెరా అందిస్తున్నారు. మరి దీంతో ఎన్ని డిగ్రీల్లో ఫొటో తీయొచ్చో తెలియాల్సి ఉంది.  దీంతోపాటు 8 మెగాపిక్సెల్‌ టెలీఫోటో కెమెరా ఉంది. 8 జీబీ ర్యామ్‌, 512 జీబీ ఇంటర్నల్‌ మెమొరీతో ఫోన్‌ను తీసుకొస్తున్నారు. 

ఈ నెలాఖరున చైనాలో మేట్‌ ఎక్స్‌ను అధికారికంగా విడుదల చేస్తారని భోగట్టా. లాంచింగ్‌ సమయంలో శాంసంగ్‌ పడ్డ ఇబ్బంది ఎదురుకాకుండా హువావే ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. బగ్స్‌, ఇష్యూస్‌ గుర్తించడానికి వీలుగా తొలుత వీటిని తక్కువ సంఖ్యలో విడుదల చేస్తారట. అన్నీ బాగుంటే ఆ తర్వాత మాస్‌ ప్రొడక్షన్‌ ప్రారంభిస్తారట.ఈ  ఫోన్‌ను ప్లాస్టిక్‌ స్క్రీన్‌తో తీసుకొస్తున్నారు.  మరి ఇది ఎంత వరకు మన్నుతుందో చూడాలి. 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle