విలువైన ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్
04-06-201904-06-2019 15:34:41 IST
Updated On 04-06-2019 15:38:25 ISTUpdated On 04-06-20192019-06-04T10:04:41.605Z04-06-2019 2019-06-04T10:04:39.860Z - 2019-06-04T10:08:25.279Z - 04-06-2019

అవసరమే ఆవిష్కరణలకు వేదిక అవుతుంది. వ్యవసాయరంగం, ఆక్వాకల్చర్, జీవన విధానం, ఆరోగ్యం, ఆహారం.. ఇలా ఒక్కటేమిటి అన్నిరంగాల నవీన ఆవిష్కరణలు ఒకేచోట ఆవిష్కృతం అయ్యాయి. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో టి-ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్ లో వివిధ రంగాలలోని వ్యక్తుల జీవితాలను అత్యంత ప్రభావితం చేసిన 65 గ్రామీణ ఆవిష్కరణలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. చేనేత రంగంలో అద్బుత నైపుణ్యాన్ని కనబరిచి పద్మశ్రీ అవార్డు అందుకున్న చింతకింది మల్లేశాన్ని ఈ సందర్భంగా జయేష్ రంజన్ సత్కరించారు.
ఈ ఎగ్జిబిషన్లో పలు ఆవిష్కరణలు చేసిన విద్యార్ధులు, ఔత్సాహిక వ్యక్తులను ‘న్యూస్ స్టింగ్ పలకరించింది. చిన్నికృష్ణుడు అనే రైతు తాను సేకరించిన వివిధ రకాల వంగడాలను ఆవిష్కరించారు. నిరాదరణకు గురవుతున్న వివిధ చిరుధాన్యాలు, దేశీయ రకం వంగడాలు, వరి వంగడాలను ఆయన వివరించారు. ఆరోగ్యాన్ని పాడుచేసి, ఆస్పత్రుల పాలుచేసే వివిధ రకాల హైబ్రీడ్ వరి ధాన్యాలను ఎక్కువగాద వాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాతకాలం వంగడాలు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని షుగర్, బీపీ వంటివాటికి దూరంగా ఉంచుతాయన్నారు. గత 10,12 సంవత్సరాలుగా తాను వివిధ రకాల విత్తనాలు సేకరిస్తున్నానని చెప్పారు. ముడిబియ్యం, రెడ్ రైస్, బ్లాక్ రైస్, బిపీటీ, కాబిసాలా వంగడాలు ఇక్కడ ఆయన ప్రదర్శించారు. తక్కువ మొత్తంలో వీటిని పండించడం వల్ల అరుదైన వంగడాలు నశించిపోకుండా ఉంటాయంటున్నారు ఆ రైతు.

ఇటు రోడ్డు ప్రమాదాల నివారణకు తాను చేసిన ఒక ఆవిష్కరణను విశదీకరించింది ఒక విద్యార్ధిని. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఇబ్బంది పడేవారికి వినూత్నంగా, సౌకర్యవంతంగా ఉండేలా సోలార్ తో నడిచే హెల్మెట్ ఇది. హెల్మెట్ లోపల చిన్న ఫ్యాన్ తో పాటు, బయట ఎల్ ఇడి బల్బు కూడా ఉంటుంది. రాత్రివేళల్లో వాహనాలకు ఉండే లైట్లు పనిచేయకపోయినా ఈ హెల్మెట్ ద్వారా ముందుకు వెళ్ళవచ్చని ఉదయం పూట సోలార్ ప్యానెల్ ద్వారా ఛార్జింగ్ చేసుకుని రాత్రిపూట వాడుకోవచ్చని ఆ విద్యార్ధిని ‘న్యూస్ స్టింగ్’కి వివరించింది.
మరోవైపు మనం నిత్యం వాడి, పడేసే వాటిని రిసైక్లింగ్ చేసి మళ్ళీ ఉపయోగించుకునేలా ఎలా చేయవచ్చో విద్యార్ధులు వివరించారు. వీటి ద్వారా ఎన్నో వస్తువులను నిరుపయోగంగా పడేయకుండా వాటిని మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. అలాగే ఆక్వాకల్చర్ కారణంగా నీటివనరులు కలుషితం అవుతున్నాయి. చేపల చెరువుల్లో వివిధ రకాల రసాయనాలను వేరుచేసి ఆరోగ్యకరమయిన చేపల పెంపకానికి ఉపయోగపడే టెక్నాలజీని తయారు చేశారు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండేడకు చెందిన ఆక్వా రైతు విశ్వనాథరాజు.
ఈ టెక్నాలజీ ద్వారా చేపలు వదిలే వ్యర్థాలను ఫిల్టర్ చేసి చెరువులను శుభ్రంగా ఉంచుకోవచ్చు. ఈయన తయారుచేసిన ఈజీ ప్లాంటర్ ద్వారా వివిధ పూలమొక్కలు నిలబడి నాటుకోవచ్చు. తానే స్వయంగా మహబూబ్ నగర్లో పావు ఎకరంలో చేపలు పెంచుతున్నానని విశ్వనాథరాజు ‘న్యూస్ స్టింగ్’తో చెప్పారు.

వీటితో పాటు అనేక రకాల ఆవిష్కరణలు మనకు కనిపిస్తాయి. చెవిటి వారికి అలారం తయారుచేశాడు కోదాడకు చెందిన విద్యార్ధి. దీని ఖరీదు 275 రూపాయలు. త్వరగా లేవడానికి, బయలుదేరడానికి ఈ అలారం ఉపయోగపడుతుంది. వివిధ రకాల నొప్పులను దూరం చేసే సిరి తైలం తయారుచేశారు. అలాగే దోమల నుంచి రక్షణకు రసాయనం, ఆహారంలో పోషకాలు వృధా కాకుండా వండుకోవడానికి ఇత్తడి పాత్ర.. ఇలా ఎన్నో ఈ టి-ఇన్నేవేషన్ వేదికపై కనిపించాయి.

జొన్నరొట్టెలు, చపాతీలు, రోటీలు, పుల్కాలు తయారుచేసేందుకు ఒక మిషన్ తయారుచేశామని తాండూరుకు చెందిన సురేష్ బాబు. ఈ మిషన్ అమెరికా, కెనడా, గల్ఫ్ దేశాల్లో బాగా అమ్ముడుపోతోంది. ఐదేళ్ల పిల్లలు కూడా దీనిపై ఈజీగా జొన్నరొట్టెలు తయారుచేసుకోవచ్చు. ఈ మిషన్ కు పదేళ్ళయినా ఎలాంటి మెయింటెనెన్స్ రాదంటున్నారు సురేష్ బాబు. ఆయన స్వయంగా జొన్నరొట్టె ఎలా తయారుచేయవచ్చో వివరించారు.

అలాగే వివిధ ఫంక్షన్స్ లో వాడిపోకుండా ఉండేలా ఫ్లవర్స్ ఎలా తయారుచేయవచ్చో ఇక్కడ చూడవచ్చు. కరెంట్ షాక్ నుంచి ఎలా తప్పించుకోవచ్చో కూడా షార్ట్ సర్క్యూట్ ఎక్విప్ మెంట్ అనే పరికరాన్ని ఒక అగ్రికల్చర్ విద్యార్ధి తన ఆవిష్కరణ ద్వారా చూపించారు. మొత్తం మీద ప్రతి ఆవిష్కరణ పర్యావరణ హితంగా ఉంది.





ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా