newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వినికిడి లోపం సరిదిద్దుకోవడం తేలికే!

19-06-201919-06-2019 16:23:07 IST
Updated On 20-06-2019 15:34:27 ISTUpdated On 20-06-20192019-06-19T10:53:07.306Z19-06-2019 2019-06-19T10:52:11.702Z - 2019-06-20T10:04:27.085Z - 20-06-2019

వినికిడి లోపం సరిదిద్దుకోవడం తేలికే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మనం అనేక శారీరక రుగ్మతలకు గురవుతుంటాం. వివిధ శారీరక ఆరోగ్య సమస్యలపై తీసుకున్న శ్రద్ధని వినికిడిలోపాలపై చూపించం. ఫలితంగా ఆ సమస్య తీవ్రమై శాశ్వతమైన చెవుడుకు దారితీస్తుంది. చెవుడు అంటే శబ్దాలను పూర్తిగా లేదా పాక్షికంగా వినలేకపోవడం. వినికిడి లోపం మిగతా శారీరకలోపాల వంటిదే. వివిధ వయసుల్లో వచ్చే వినికిడి లోపాలు, వాటికి అందుబాటులో ఉన్న వినికిడి యంత్రాల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం. గతంతో పోలిస్తే వినికిడి యంత్రాల వినియోగం బాగా పెరిగింది. వివిధ వినికిడి ఇబ్బందులను అధిగమించడానికి మార్కెట్లో దొరికే వివిధ ఇయరింగ్ ఎయిడ్స్ ఉపయోగించుకోవచ్చు. 
Image result for Hearing aids

 

గతంతో పోలిస్తే ఇయరింగ్ ఎయిడ్స్ బాగా ఉపయోగిస్తున్నారని రావూస్ ఈఎన్టీ ఆడియాలజిస్ట్ డాక్టర్ శ్రీ చరణ్ ‘న్యూస్ వెల్లడించారు. ఇంతకుముందు మధ్య వయస్కులు తమకు వినపడకపోయినా ఫర్వాలేదని భావించేవారని, ఇప్పుడు వినికిడి యంత్రాలను వారు విరివిగా వాడుతున్నారని ఆయన చెప్పారు. ఇయరింగ్ ఎయిడ్స్‌లో అనలాగ్ పరికరాలు వాడడంలేదన్నారు. ఎక్కువమంది డిజిటల్ ఇయరింగ్ ఎయిడ్స్ వాడుతున్నారని డాక్టర్ శ్రీచరణ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఇయరింగ్ ఎయిడ్స్‌కి ఆదరణ బాగా పెరుగుతోందని వివరించారు. పెద్ద వయసు వారు కూడా తమకున్న వినికిడి లోపం పోవాలని కోరుకుంటున్నారు. వ‌ృద్ధులు కూడా మంచి వినికిడి యంత్రం ఉంటే చిన్నచిన్న శబ్ధాలు కూడా వినగలుగుతారని డాక్టర్ తెలిపారు.

వినికిడి లోపం ఎలా వస్తుందంటే... 

వినికిడి లోపం సాధారణంగా వంశపారంపర్యం, మేనరికంవల్ల కూడా రావచ్చు, డయాబెటిస్,బీపీ, యాంటిబయాటిక్స్ ఎక్కువగా వాడిన వారికి వినికిడి లోపం రావచ్చు. మందుల ప్రభావం సున్నితమయిన వినికిడి నరంపై పడి వినికిడి లోపం కలగవచ్చు. అందుకే సరైన వినికిడి యంత్రాలు ఎంపిక చేసుకోవాలన్నారు. వాటర్ ఫ్రూప్ ఇయరింగ్ ఎయిడ్స్ ఎప్నుడైనా వాడవచ్చు. డిజిటల్ ఇయరింగ్ ఎయిడ్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు ఉండవన్నారు.

వినికిడి లోపం ఉన్నవారిలో చదువుకునే పిల్లలకు ఎక్కువగా మంచి వినికిడి యంత్రం ఇవ్వగలగాలన్నారు. చిన్నపిల్లలకు వినికిడి లోపం ఉంటే వాటిని వెంటనే సరిదిద్దాలన్నారు. లేదంటే వారు కెరీర్ పరంగా ఇబ్బంది పడతారన్నారు. అలాగే ఉద్యోగులు, వ‌ృద్ధులకు వారి అవసరాలకు అనుగుణంగా వినికిడి యంత్రాలు సెలెక్ట్ చేసుకోవచ్చన్నారు. మొత్తం మీద మనదేశంలో అనేక విధాలైన ఇయరింగ్ ఎయిడ్స్ దొరుకుతున్నాయి. రేంజ్ 13 వేల నుంచి మొదలై 2 లక్షల 90 వేలు వరకూ ఉంటాయి. మనకున్న బడ్జెట్, అవసరాన్ని బట్టి ఇయరింగ్ ఎయిడ్స్ ఎంపికచేసుకోవచ్చు. వినికిడి లోపం వున్నవారు దానిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈఎన్టీ ఆస్పత్రిలోని ఆడియాలజిస్ట్ ద్వారా పరీక్ష చేయించుకోవాలని డాక్టర్ శ్రీచరణ్ సూచిస్తున్నారు. 

 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle