newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

విద్యార్దులకు వరం ఈ యాప్

10-06-201910-06-2019 16:41:14 IST
Updated On 10-06-2019 16:31:46 ISTUpdated On 10-06-20192019-06-10T11:11:14.252Z10-06-2019 2019-06-10T11:00:38.713Z - 2019-06-10T11:01:46.000Z - 10-06-2019

 విద్యార్దులకు వరం ఈ యాప్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వివిధ కోర్సులు చదివే విద్యార్ధులు, మంచి ర్యాంకులు సాధించి ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారికి ఇప్పుడు ఎంతో సౌలభ్యం ఏర్పడింది. తాము చదివే క్లాసులో అద్భుతమయిన ప్రతిభ కనబరచడానికి అనేక ఎడ్యుకేషన్ యాప్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి. అన్ని పోటీపరీక్షలకు కావాల్సిన స్టడీమెటీరియల్, తరగతులు, సందేహాలు తీర్చే లైవ్ డిబేట్స్.. ఒక్కటేమిటి అన్నిరకాల సదుపాయాలను అందిస్తున్నాయి యాప్స్. ముఖ్యంగా బైజు యాప్, టాపర్ యాప్ లు విద్యార్ధినీ, విద్యార్ధులకు ఎన్నో తెలియని విషయాలను అందిస్తున్నాయి. 

Image result for toppr app

ఈ యాప్ ద్వారా రోజువారి ఆన్ లైన్ తరగతులు, వివిధ సందేహాలకు సమాధానాలు, మాక్ టెస్ట్ లు, ఇంటర్ ఫేస్ మాడ్యూల్స్ అందిస్తారు. ఐఐటీ ముంబై విద్యార్దులు ఈయాప్ తయారుచేశారు. షార్ట్ వీడియోల ద్వారా విద్యార్దుల సందేహాలను తీరుస్తారు. ఆయా సబ్జెక్టులలో విద్యార్ధులు వెనుకబడితే వారికి భరోసా ఇస్తూ.. సింపుల్ టెక్నిక్స్ నేర్పుతారు.

వారం వారం ఆన్ లైన్ టెస్ట్ లు పెట్టి వారి సామర్ధ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు. ఈ యాప్ ద్వారా విద్యార్దులు ఆరోజు ఏం చదివారో, ఏ టెస్ట్ ఎలా రాశారో తల్లిదండ్రులు మోనిటర్ చేయవచ్చు. ఆయా విద్యార్ధుల వ్యక్తిగత ప్రతిభను లెక్కగట్టి.. వారిని మరింత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దవచ్చు. 

వివిధ సబ్జెక్టులలో లబ్ధప్రతిష్టులైన లెక్చరర్లు, ప్రొఫెసర్లు ఈయాప్ కి తమ సహాయసహకారాలు అందిస్తున్నారు. వీరి ద్వారా విద్యార్ధులు తమకు ఎదురయ్యే సందేహాలు అప్పటికప్పుడే తీర్చుకోవచ్చు.

మీదగ్గర స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, ట్యాబ్ ఉంటే చాలు ఈ యాప్ కి కనెక్ట్ కావచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే మీకు అందుబాటులో ఉండే హోం ట్యూటర్ అన్నమాట. ఐదవ తరగతి నుంచి 10+2 వరకూ ఈ యాప్ ద్వారా సేవలు పొందవచ్చు.  20 బోర్డులు, 60 కాంపిటీటీవ్ పరీక్షలు,  40 సబ్జెక్ట్ లలో టాపర్ యాప్ సేవలు అందుతాయి. మీరు, మీ పిల్లలు ఎక్కడ ఉన్నా యాప్ సేవలు పొందవచ్చు.

వివిధ రాష్ట్రాల బోర్డులతో పాటు జాతీయ స్థాయి అర్హత పరీక్షలకు తర్ఫీదుని అందిస్తుంది ఈ యాప్. ఇప్పటివరకూ 81 లక్షలమందికి పైగా విద్యార్ధులు ఈయాప్ డౌన్ లోడ్ చేసుకున్నారు. విద్యార్ధినీ, విద్యార్ధులు 37కోట్ల 43 లక్షల 10వేల 274ప్రశ్నలకు సమాధానం అందుకున్నారు. సుమారు 40 లక్షల ఆన్ లైన్ టెస్ట్ లు నిర్వహించారు. 30 లక్షలకు పైగా లైవ్ డెమోలు ఈ యాప్ ద్వారా జరిగాయి. దేశవ్యాప్తంగా రోజూ లక్షలాదిమంది ఈ యాప్ ను వాడుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle