newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విండోస్‌ కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఇలానే ఉంటుందా...

27-10-201927-10-2019 16:11:52 IST
2019-10-27T10:41:52.526Z27-10-2019 2019-10-27T10:41:49.375Z - - 15-04-2021

విండోస్‌ కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఇలానే ఉంటుందా...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
డ్యూయల్‌ స్క్రీన్‌ మొబైళ్ల కోసం విండోస్‌ కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను రూపొందిస్తోందని చాలా రోజులగా వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా దానికి సంబంధించిన కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. వీటిని మైక్రోసాఫ్టే పొరపాటున లీక్‌ చేసింది. మైక్రోసాఫ్ట్‌ త్వరలో లాంచ్‌ చేయనున్న సర్ఫేస్‌ నియో డ్యూయల్‌ స్క్రీన్‌ డివైజ్‌లో ఈ కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉండబోతోందని సమాచారం. దీనికి విండోస్‌ 10 ఎక్స్‌ అనే పేరు పెట్టారు. సర్ఫేస్‌ నియోను ఇటీవల మైక్రోసాఫ్ట్‌ లాంచ్‌ చేసింది.

ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్‌ పొరపాటున విండోస్‌ 10 ఎక్స్‌ డిజైన్‌ డాక్యుమెంట్‌ను పబ్లిష్‌ చేసేసింది. తర్వాత తీసేసింది అనుకోండి. ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల టెక్‌ వెబ్‌సైట్‌ వెర్జ్‌ పసిగట్టింది. విండోస్‌ 10 ఎక్స్‌ డాక్యుమెంట్‌ ప్రకారం చూస్తే కొత్త ఓఎస్‌ను కామ్‌సెల్‌ ల్యాప్‌టాప్‌ హార్డ్‌వేర్‌ కోసం కూడా సిద్ధం చేస్తున్నారట. అంతేకాదు విండోస్‌ 10 ఎక్స్‌ను కేవలం నియో కోసమే తయారు చేయడేదట.

డ్యూయల్‌ స్క్రీన్‌ ఉండే ఇతర డివైజ్‌లకు కూడా వాడుకోవచ్చట. అందుకుతగ్గట్టే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను రూపొందించారట. ఇందులో స్టార్ట్‌ మెనూలో మార్పులు చేశారు. దీనిని లాంచర్‌ అని పిలుస్తారు. దీనినే యూనివర్శల్‌ సెర్చ్‌ బార్‌గానూ వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ తరహాలోనే ఈ సెర్చ్‌ బార్‌లో సెర్చ్‌ చేస్తే వెబ్‌ రిజల్ట్స్‌, అవైలబుల్‌ యాప్స్‌, స్పెసిఫిక్‌ యాప్స్‌ కనిపిస్తాయి. దీంతోపాటు ఫ్రీక్వెంట్లీ, రీసెంట్లీ యూజ్డ్‌ యాప్స్‌, ఫైల్స్‌, వెబ్‌సైట్స్‌ని కూడా ఈ లాంచర్‌ సూచిస్తుంది. 

విండోస్‌ 10 ఎక్స్‌లో ఫేసియల్‌ రికగ్నిషన్‌ లో మార్పులు చేశారు. కొత్త ఓఎస్‌ ఉన్న డివైజ్‌ను ఓపెన్‌ చేయగానే యూజర్‌ ఫేస్‌ను వేగంగా గుర్తిస్తుంది. దీని వల్ల ఫేసియల్‌ అన్‌లాక్‌ సులభంగా, వేగంగా ఉంటుంది. ఇందులో మోడరన్‌ ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌ను తీసుకొస్తున్నారు. ఇందులో మీ డివైజ్‌లో ఉన్న ఫైల్స్‌తోపాటు ఆఫీస్‌ 365, వన్‌ డ్రైవ్‌లోని ఫైల్స్‌ను కూడా చూసుకోవచ్చు. విండోస్‌ ఎక్స్‌లో యాక్షన్‌ సెంటర్‌ మరింత వేగంగా ఉండబోతోంది. యాక్షన్‌ సెంటర్‌ని మీకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు.

 

 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle