newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వావ్‌... ‘గూగుల్‌ కేమియోస్‌’ ఇకపై ఆండ్రాయిడ్‌లో కూడా..

23-10-201923-10-2019 10:07:05 IST
2019-10-23T04:37:05.964Z23-10-2019 2019-10-23T04:37:03.043Z - - 17-04-2021

వావ్‌... ‘గూగుల్‌ కేమియోస్‌’ ఇకపై ఆండ్రాయిడ్‌లో కూడా..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గూగుల్‌ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఫీచర్‌ ఇన్నాళ్లూ ఆండ్రాయిడ్‌లో లేదంటే మీరు నమ్మగలరా? కానీ అలాంటి ఓ ఫీచర్‌ ఉంది. అదే ‘గూగుల్‌ కేమియోస్‌’.  ఇన్నాళ్లూ ఐఓఎస్‌ లో మాత్రమే ఈ ఆప్షన్‌ అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఆండ్రాయిడ్‌ లోకి కూడా తీసుకొచ్చింది.  గూగుల్‌ కేమియోస్‌ అంటే ఏంటి అనేదేగా మీ ప్రశ్న. 

గూగుల్‌ కేమియోస్‌ సెలబ్రిటీల నేపథ్యంలో గూగుల్‌ తీసుకొచ్చిన యాప్‌. గూగుల్‌లో సెలబ్రిటీల గురించి ఎక్కువగా సెర్చ్‌ చేసిన విషయాలు, ప్రశ్నలకు ఆ సెలబ్రిటీలు చెప్పే వీడియో సమాధానాల సమాహారమే గూగుల్‌ కేమియోస్‌. గూగుల్‌లో ఏదైనా సెలబ్రిటీ పేరు వెతికేటప్పుడు వాళ్ల ప్రొఫైల్స్‌ దిగువ చిన్న చిన్న వీడియోలు కనిపిస్తాయి. వాటిలో ట్రెండింగ్‌ ప్రశ్నలకు ఆ సెలబ్రిటీలు సమాధానాలు చెబుతారు. అర్థమైంది కదా. అదీ సంగతి. 

గూగుల్‌ కెమియోస్‌ చాలా రోజుల  నుంచి అందుబాటులో ఉన్నా అది కేవలం ఆపిల్‌ మొబైల్స్‌ వినియోగదారులకు మాత్రమే. ఇటీవల డెస్క్‌టాప్‌ వినియోగదారులకు అందించారు. తాజాగా ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లో తీసుకొచ్చారు. గూగుల్‌లో కావాల్సిన సెలబ్రిటీ పేరుతో సెర్చ్‌ చేస్తే చాలు. ఉదాహరణకు గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా నే తీసుకొండి. 

గూగుల్‌ లో ప్రియాంక చోప్రా అని వెతికితే ప్రొఫైల్‌, కొన్ని సెర్చ్‌ వివరాలు కనిపిస్తాయి. కాస్త దిగువకు పేజీ స్క్రోల్‌ చేస్తే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ తరహాలో కొన్ని బ్లాక్స్‌ కనిపిస్తాయి. అదే కేమియోస్‌. అందులో ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలుంటాయి.  ఇందులో ప్రస్తుతానికి ఎక్కువగా హాలీవుడ్‌ టీవీ, సినిమా ఆర్టిస్ట్‌ల వివరాలే ఎక్కువగా ఉన్నాయి. భారత నటుల వివరాలు ఒక్కొక్కటిగా యాడ్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ నుంచి ప్రియాంక చోప్రా వివరాలు వస్తున్నాయి. అదే టాలీవుడ్‌ నుంచి అయితే అక్కినేని నాగచైతన్య ఒక్కడే కనిపిస్తున్నాడు. 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle