newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వాట్సాప్ హ్యాకింగ్‌తో కుటుంబాలు, మిత్రులకు చేటు

05-04-202005-04-2020 16:13:49 IST
Updated On 05-04-2020 16:15:14 ISTUpdated On 05-04-20202020-04-05T10:43:49.804Z05-04-2020 2020-04-05T10:43:47.439Z - 2020-04-05T10:45:14.844Z - 05-04-2020

వాట్సాప్ హ్యాకింగ్‌తో కుటుంబాలు, మిత్రులకు చేటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశం యావత్తూ లాక్‌డౌన్ లోకి వెళ్లిపోయింది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని వ్యాపారాలు, వాణిజ్య సేవలు మూతపడ్డాయి. అయితే ఈ సంక్షోభ సమయంలో కూడా హ్యాకర్లు తమ పనిలో బిజీ బిజీగా వున్నారు. తాజా అంచనాల  ప్రకారం వాట్సాప్ ఖాతాలను  హ్యాక్ చేసే పనిలో హ్యాకర్లు మునిగిపోయారు. సైబర్ నేరగాళ్లు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదని వాబేటా ఇన్ఫో తాజాగా హెచ్చరించింది. 

అనుమానాస్పద లింకులు పంపుతూ, వాటిల్లోకి లాగిన్ కావాలని కోరుతున్నారనీ, అమాయక యూజర్ల నుంచి ఓటీపీలను కొట్టేస్తున్నారని తెలిపింది. పలు ఈ మెయిల్స్ ను కూడా పంపుతున్నారని పేర్కొంది. ఈ వ్యవహారంలో వాట్సాప్ వినియోగదారులు అప్రతమత్తంగా వుండాలని సూచించింది. మరోవైపు ఇప్పటికే కొన్ని ఖాతాలు హ్యాక్   అయ్యాయని  ది టెలిగ్రాఫ్  నివేదించింది. 

గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుండి ఓటీపీ చెప్పాలంటూ మెసేజ్లను అందుకున్నామని పలువురు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో తాజా హెచ్చరికలను జారీ చేసింది. ఈ  ఓటీపీని  సంబధిత వాట్సాప్ ఖాతాలోకి చొరబడటానికి హ్యాకర్లు వినియోగిస్తున్నారని తెలిపింది. ఇది గమనించని వినియోగదారులు  మోసపోతున్నారనీ,  తద్వారా వ్యక్తిగత చాట్‌లు, ఫోన్ నంబర్, పేరు, ఇమెయిల్ ఐడి, బ్యాంక్ ఖాతా వివరాలు, ఫేస్‌బుక్ లాగిన్ లాంటి ఎంతో విలువైన డేటాను హ్యాకర్లు యాక్సెస్ చేస్తున్నారని తెలిపింది. 

ఓటీపీ, భద్రతా కోడ్ విషయంలో యూజర్లు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని కోరింది. ఎప్పుడైనా అలాంటి సందేశాలను స్వీకరించినట్లయితే పట్టిచ్చుకోవద్దని కోరింది. దీంతో పాటు కొన్ని చిట్కాలను ట్విటర్లో షేర్ చేసింది. భద్రతా ధృవీకరణ కోడ్‌లను ఇష్టమైన వారితో సహా ఎవరితోనూ పంచుకోవద్దని వినియోగదారులను కోరింది. 

మరింత రక్షణ కోసం ఐవోఎస్, ఆండ్రాయిడ్ వెర్షన్లలో అందుబాటులో ఉన్న (సెటింగ్ ఎకౌంట్ టూ స్టెప్ వెరిఫికేషన్) టూ స్టెప్ వెరిఫికేషన్ పద్ధతిని ఎనేబుల్ చేయాలి. తద్వారా వాట్సాప్ ఖాతాను హ్యాకర్ల బారినుంచి రక్షించుకోవచ్చని తెలిపింది. సెట్టింగుల మెనూకు వెళ్లి, గోప్యతా ఎంపికపై క్లిక్ చేసి, ప్రొఫైల్ ఫోటో ఎంపికను మార్చాలి. మై కాంటాక్ట్స్ అనేదానిపై క్లిక్ చేయాలి. అలాగే కాంటాక్ట్ లో లేని అనుమానాస్పద ఫోన్ నంబర్‌ను మెసేజ్  వస్తే.. విస్మరించండి. ఇకపై అలాంటి సందేశాన్ని పంపకుండా నిరోధించేలా సదరు నెంబర్ బ్లాక్ చేయాలని కోరింది. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle