వాట్సాప్ సేఫ్ కాదా? యూజర్ల డేటా గల్లంతేనా?
08-06-202008-06-2020 09:02:33 IST
Updated On 08-06-2020 09:30:10 ISTUpdated On 08-06-20202020-06-08T03:32:33.709Z08-06-2020 2020-06-08T03:32:23.282Z - 2020-06-08T04:00:10.335Z - 08-06-2020

సోషల్ మీడియాను జనం బాగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా గ్రాం యూజర్లు బాగా ఎక్కువ అవుతున్నారు. అయితే యూజర్ల డేటా భద్రమేనా? అంటే అనుమానమే అంటున్నారు టెక్నికల్ ఎక్స్ పర్ట్స్. కొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటోంది వాట్సాప్.. ఇప్పుడు వాటిల్లో ఉన్న బగ్ కారణంగా అనేక మంది యూజర్ల గోప్యత ప్రమాదంలో పడేస్తోంది. ఆ బగ్ గూగుల్ సెర్చ్ ఫలితాల్లో యూజర్ల వాట్సాప్ నెంబర్లు కనిపించేలా చేస్తోంది. ‘వాట్సాప్ క్లిక్ టూ చాట్ ఫీచర్‌లోని ఓ బగ్ సోషల్ మెసేజింగ్ సైట్ యొక్క వినియోగదారుల ఫోన్ నంబర్లను గూగుల్ సెర్చ్‌ను ఇండెక్స్ చేయడానికి అనుమతించడంతో ఈ ముప్పు ముంచుకొచ్చింది. ఇది ఎవరినైనా కూడా వెబ్‌లో వినియోగదారుల ఫోన్ నంబర్లను వెతకడానికి అనుమతిస్తుంది. తద్వారా వాట్సాప్ యూజర్ల గోప్యత ప్రమాదంలో పడుతుందని ఓ నిపుణుడు అంటున్నారు. గూగుల్ సెర్చ్‌లో సాధారణ టెక్స్ట్ రూపంలో యూజర్ల నెంబర్లు కనబడటం వల్ల స్కామర్లు వాటన్నింటిని సేకరించే అవకాశం ఉంది. అలాగే ఇప్పటివరకు గూగుల్‌లో 3,00,000 ఇండెక్స్ నెంబర్స్ కనిపించినట్లు నిపుణుడు అంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. యూజర్ల వ్యక్తిగత ఫోన్ నెంబర్లు సోషల్ మీడియాలో లీక్ అయితే.. స్కామర్లు వారికి మెసేజ్, లేదా కాల్ చేయవచ్చు. అంతేకాకుండా స్పామర్లు, సేల్స్ మార్కెటింగ్ ఏజెన్సీలకు కూడా వారి ఫోన్ నెంబర్లను అమ్ముకుని సొమ్ముచేసుకునే అవకాశం ఉందంటున్నారు. వాట్సాప్ యూజర్లు ఒక్క క్లిక్ ద్వారా అసత్య, అవసరం లేని మెసేజ్‌లను బ్లాక్ చేయవచ్చునని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది. తమకు వినియోగదారుల రక్షణే ముఖ్యమని, గోప్యత విషయంలో తాము ఖచ్చితత్వం పాటిస్తామంటోంది వాట్సాప్. ఇంతకముందు కూడా ఫేస్ బుక్ యూజర్లకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. అందుకే మీరు మీ వాట్సాప్ కి ఇచ్చే ఫోన్ నెంబర్లను మీ బ్యాంకు అకౌంట్, ఇతర ఆర్థిక వ్యవహారాలకు ఇవ్వకుండా వుంటే మంచిది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా