newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వాట్సాప్ మెసేజ్ లు మాయమవుతాయ్...

03-10-201903-10-2019 09:41:30 IST
2019-10-03T04:11:30.310Z03-10-2019 2019-10-03T04:11:28.517Z - - 20-04-2021

వాట్సాప్ మెసేజ్ లు మాయమవుతాయ్...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మిగిలిన యాప్స్ వాట్సాప్ ను ఫాలో అవుతుంటే... వాట్సాప్ మాత్రం ఫేస్ బుక్, దాని యాప్స్ ను ఫాలో అవుతోందా? తాజాగా ప్రవేశపెడుతున్న ఫీచర్లు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. అయితే అవన్నీ యూజర్లకు బాగా ఉపయోగపడేవే. స్టిక్కర్లు లాంటివి ఇన్ స్టాగ్రామ్ నుంచి తీసుకుంటే... ఇప్పుడు ఫేస్ బుక్ మెసెంజర్ నుంచి మరో ఆప్షన్ ను తీసుకుంది. అదే మెసేజ్ డిస్ అపియర్. అంటే నిర్ణీత సమయం తర్వాత మీరు పంపిన మెసేజ్ లు డిస్ అపియర్ అయిపోతాయి. అదీ మీరు కోరుకుంటేనే.

ఫేస్ బుక్ మెసెంజర్ లో ఉన్న కీలకమైన ఆప్షన్ సీక్రెట్ కాన్వర్ సేషన్. అంటే సాధారణ కాన్వర్ సేషన్ లానే కనిపించినా.. అందులో ఛాట్ చేసేవి మీరు కోరుకున్నట్లు డిలీట్ అయిపోతాయి. అయితే అవి ఎంత సేపటిలో డిలీట్ అవ్వాలి అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. మీరు పంపిన మెసేజ్ లు అవతలి వ్యక్తి చూసిన వెంటనే మీరు అనుకున్న సమయం ప్రకారం డిలీట్ అయిపోతాయి.

అలాగే మీరు ఛాట్ హిస్టరీ సేవ్ లో ఉండదు. ఇప్పుడు ఈ తరహా ఫీచర్ ను వాట్సాప్ లోకి కూడా తీసుకొస్తున్నారు.  అయితే ప్రస్తుతం దీనిని గ్రూప్ ఛాట్స్ లోనే ఈ ఆప్షన్ ను తీసుకొస్తున్నారు.  బీటా ప్రోగ్రామింగ్ లో భాగంగా కొంతమందికి ఈ ఆప్షన్ ఇప్పటికే అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ పూర్తి స్థాయిలో తీసుకొస్తారు. 

డిస్ అపియర్ ఫీచర్ వాట్సాప్ వెర్షన్ 2.19.275 లో కనిపించింది. అయితే ఆ తర్వాత దానిని డిసేబుల్ చేశారు. త్వరలో మళ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఆప్షన్ల ప్రకారం చూస్తే మెసేజ్ ను ఐదు సెక్ల నుంచి ఒక గంట మధ్యలో డిస్ అపియర్ అయ్యేలా ఆప్షన్లు తీసుకొస్తున్నారు. త్వరలో ప్రైవేటు కాన్వర్ సేషన్ ఆప్షన్ ని కూడా తీసుకొస్తారని సమాచారం. అంటే మెసెంజర్ లో ఉన్న ఆప్షన్ లన్నీ తీసుకొస్తున్నట్లే. 

 

 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle