newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వాట్సాప్ కొత్త ఫీచర్లు.. మీకు తెలుసా?

04-05-202004-05-2020 10:05:16 IST
Updated On 04-05-2020 10:28:38 ISTUpdated On 04-05-20202020-05-04T04:35:16.183Z04-05-2020 2020-05-04T04:32:26.090Z - 2020-05-04T04:58:38.607Z - 04-05-2020

వాట్సాప్ కొత్త ఫీచర్లు.. మీకు తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెల్లారి లేస్తే చాలు జనం స్మార్ట్ ఫోన్లకే బానిసలుగా మారిపోతున్నారు. సోషల్ మీడియా యాప్ లతో పాటు వాట్సాప్,ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, ట్విట్టర్లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి, దిగ్గజ చాటింగ్ ఆప్ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతోంది. స్మార్ట్‌ఫోన్‌ వాడే ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగం అయిపోయింది వాట్సాప్. కేవలం వ్యక్తిగత జీవితంలోనే కాదు.. వృత్తి జీవితంలో భాగపోయింది. అందుకే ఎప్పటికప్పుడు వాట్సాప్‌ తన ఫీచర్స్‌ను అప్‌డేట్‌చేస్తూ వస్తోంది. ఇప్పటికీ ఈ యాప్‌ విషయంలో ఉన్న అసంతృప్తి మల్టీ డివైజ్ యాక్సెస్ అడ్డంకులను తొలగించేందుకు  వాట్సాప్‌ ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం 2.20.143 ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్‌ కనిపిస్తోంది. అంటే మీరు ఒక డివైజ్ లో వాట్సాప్ వాడితే మరో డివైజ్ లోకి ఎంటరవ్వడం కష్గం. అయితే తాజా మార్పులతో మల్టీ డివైజ్ యాక్సెస్ ఈజీ కానుంది. వాట్పప్ రెండు చోట్ల వాడాలనుకునేవారికి తాజా న్యూస్ రిలీఫ్ ఇవ్వనుంది. ప్రస్తుతం ఏక కాలంలో ఒకే అకౌంట్‌ వాడాలంటే ఉన్న ఏకైక ఆప్షన్‌ వాట్సాప్‌ వెబ్‌ మాత్రమే. అయితే, ఈ మల్టీ డివైజ్‌ ఫీచర్‌ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే అందుబాటులోకి వస్తే ఒక ఫోన్‌, టాబ్లెట్‌ లేదా ఒకటి కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌తో ఒకేసారి రెండు వేర్వేరు ఫోన్లలో వాట్సాప్‌ను వాడుకునే అవకాశం ఉంటుందని వాట్సాప్ చెబుతోంది. 

అంతేకాదు వాట్సాప్ తమ ఖాతాదారులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ పే, ఫోన్ పే తరహాలోనే  పేమెంట్లు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నవాట్సాప్ త్వరలోనే భారత్‌లోని ప్రజలందరికీ రుణాలు ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఫేస్‌బుక్‌ తన ఫైనాన్సియల్ సర్వీసులను మరింత విస్తరించాలని అనుకోవడంతో క్రెడిట్ సర్వీస్‌ను ఇండియాలో లాంచ్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ అఫ్ ఇండియా నుంచి అనుమతులను వాట్సాప్ పొందింది.

ప్రస్తుతం ఈ ఫీచర్ పేమెంట్స్ ఆప్షన్‌లో చూడవచ్చు. ఈ ఫీచర్ అచ్చం పేటీఎం, మోబిక్విక్, ఫోన్ పే, గూగుల్ పే మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ సౌకర్యం త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అదే అందుబాటులోకి వస్తే మరో డిజిటల్ ప్లాట్ ఫాం వాడుకునే అవకాశం వినియోగదారులకు దక్కనుంది. 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   21 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle