వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్లు ఇవే..!
05-08-201905-08-2019 11:39:32 IST
2019-08-05T06:09:32.514Z05-08-2019 2019-08-05T06:09:27.987Z - - 12-04-2021

వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్లు ఇవే..!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ఎంత ఆధరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. వాట్సాప్ ఇంతలా ఆధరణ పొందడానికి ఎప్పటికప్పుడు వినియోగారుల అవసరాలకు అనుగుణంగా యాప్‌లో మార్పులు చేస్తుండటం కూడా ఒక కారణం. తాజాగా వాట్సాప్ మరికొన్ని నూతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.
1. వాయిస్ మేసేజ్ వినవచ్చు
ఇంతకాలం వాట్సాప్‌లో పంపించే మెసేజ్‌లు, వీడియోలు, ఫోటోలను పంపే ముందు పరిశీలించుకునే అవకాశం ఉంది. అంతా ఓకే అనుకున్న తర్వాతే పంపిస్తాము. అయితే, వాయిస్ మెసేజ్‌కు మాత్రం ఈ అవకాశం ఉండేది కాదు. వాయిస్ మేసేజ్ రికార్డు చేయగానే ఆటోమెటిక్‌గా అవతలి వారికి వెళ్లిపోయేది. ఇప్పుడు ఇలా కాకుండా వాయిస్ మేసేజ్‌ను సైతం పరిశీలించి పంపించే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకువస్తోంది.
2. ఇక ఒకే డివైజ్ కాదు
వాట్సాప్ వినియోగదారులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్‌ను వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటివరకు వాట్సాప్ కేవలం ఒక డివైజ్‌లోనే వినియోగించుకునే అవకాశం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఒకేసారి బహుళ డివైజ్‌లలో వినియోగించుకునే పీచర్‌ను వాట్సాప్ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.
3. ఫార్వర్డ్ మెసేజ్‌లకు కొత్త లేబెల్
ఫార్వర్డ్ మెసేజ్‌లు వాట్సాప్ వినియోగదారులను పీడించే అసలు సమస్య. అనేక తప్పుడు ప్రచారాలు ఈ పార్వర్డ్ మెసేజ్‌ల ద్వారా వస్తుంటాయి. ఏ మెసేజ్‌ను నమ్మలో, దేనిని నమ్మొద్దో తెలియని పరిస్థితి. అయితే, ఇప్పటికే ఫార్వర్డ్ మేసేజ్‌లను గుర్తించే ఫీచర్‌ను తీసుకువచ్చిన వాట్సాప్ దీనికి మరిన్ని మార్పులు చేస్తోంది. ఐదుసార్లకు మించి ఫార్వర్డ్ చేసిన మెసేజ్‌కు ఎక్కువగా ఫార్వర్డ్ అవుతున్న మెసేజ్ అనే అర్థం వచ్చేలా కొత్త ఐకాన్ కనిపించనుంది.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా