newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వాట్సాప్‌లో మరో ‘వావ్‌’ ఫీచర్‌ వచ్చేసింది!

23-09-201923-09-2019 10:09:20 IST
2019-09-23T04:39:20.480Z23-09-2019 2019-09-23T04:39:18.329Z - - 14-04-2021

వాట్సాప్‌లో మరో ‘వావ్‌’ ఫీచర్‌ వచ్చేసింది!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వాట్సాప్‌లో మెసేజ్‌లు వచ్చినంత వేగంగా కొత్త ఫీచర్లు వస్తుంటాయి. వాట్సాప్‌ను ఎక్కువగా వాడేవారు ఎవరైనా ఈ మాటే చెబుతారు. ఎందుకంటే ఇటీవల కాలంలో వాట్సాప్‌ తెగ కొత్త ఫీచర్లు టెస్ట్‌ చేస్తోంది. ఇందులో భాగంగా మరో కొత్త ఫీచర్‌ను టెస్ట్‌ చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. కొన్నాళ్లుగా ఈ ఫీచర్‌ కొందరికే అందుబాటులో ఉంది. ఇప్పుడు అందరూ దీన్ని వినియోగించుకోవచ్చు.

ఇప్పటివరకు వాట్సాప్‌లో ఫొటోలు మరొకరికి ఫార్వార్డ్‌ చేసుంటారు. వీడియోలు పంపించి ఉంటారు. టెక్ట్స్‌ మెస్‌లు వరుస ఫార్వర్డ్‌లు చేసి ఉంటారు. వాట్సాప్‌ స్టేటస్‌ చూసి రిప్లై ఇచ్చి ఉంటారు. మీకు వచ్చిన వాట్సాప్‌ వీడియెలు, ఫొటోలను షేర్‌ ఆప్షన్‌ ద్వారా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌, హెలోలో షేర్‌ చేసి పంపించి ఉంటారు. దీంతోపాటు మీ వాట్సాప్‌ స్టేటస్‌ ఎంతమంది చూశారనేది తెలుసుకొని ఉంటారు. వీటితోపాటు ఇకపై మీ వాట్సాప్‌ స్టేటస్‌ను అక్కడి నుంచే ఫేస్‌బుక్‌లో షేర్‌ చేయొచ్చు. 

వాట్సాప్‌ స్టేటస్‌ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేయాలంటే...

స్టెప్‌ 1 : వాట్సాప్‌ ఓపెన్‌ చేసి స్టేటస్‌ ట్యాబ్‌ క్లిక్‌ చేయండి.

స్టెప్‌ 2 : స్టేటస్‌ మీకు కావాల్సిన వీడియో, ఇమేజ్‌ అప్‌లోడ్‌ చేయండి.

స్టెప్‌ 3: ఆ స్టేటస్‌ పబ్లిష్‌ అయిన తర్వాత... కుడివైపు ఉన్న మూడు చుక్కల మెనూ క్లిక్‌ చేయండి

స్టెప్‌ 4: అక్కడ షేర్‌ క్లిక్‌ చేసి మీకు కావాల్సినట్లుగా ఆ పోస్టును షేర్‌ చేసుకోండి.

మరికొందరికి షేర్‌ బదులుగా నేరుగా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసుకునే ఆప్షన్‌ కనిపిస్తోంది. అలా చేస్తే నేరుగా మీ స్టేటస్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ అవుతుంది. 

బోనస్‌ టిప్‌:

వాట్సాప్‌ కొత్తగా ఇచ్చిన ఆప్షన్‌ ప్రకారం మ్యూట్‌ చేసిన స్టేటస్‌ ఇక మీ లిస్ట్‌లో కనిపించవు. గతంలో అయితే జాబితాలో ఆఖరులో మ్యూట్‌ చేసిన స్టేటస్‌లు కనిపించేవి. ఇప్పుడు ఆ సమస్య లేకుండా పూర్తి కనిపించవు. అయితే ఈ ఆప్షన్‌ కూడా అందరికీ అందుబాటులో లేదు. త్వరలో పూర్తి స్థాయిలో ఈ ఫీచర్‌ను విడుదల చేస్తారు. 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle