facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
* తొలివిడత ఎన్నికలకు నోటిఫికేషన్ .. నామినేషన్లకు శ్రీకారం ..నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 25వ తేదీ* రక్షణమంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత.. రాష్ట్రపతి సహా పలువురి నివాళి * ఒకేసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ *మల్కాజ్ గిరి లోక్ సభ జనసేన అభ్యర్థిగా బి.మహేందర్ రెడ్డి *సెన్సార్ బోర్డు పై వర్మ సీరియస్... కోర్టుకెళతానన్న ఆర్జీవీ*కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన వినోద్ కుమార్

వాట్సాప్‌లో కొత్త ఫీచ‌ర్‌... ఇక డోంట్ వర్రీ!

13-03-201913-03-2019 08:20:46 IST
2019-03-13T02:50:46.290Z13-03-2019 2019-03-13T02:46:24.553Z - - 18-03-2019

వాట్సాప్‌లో కొత్త ఫీచ‌ర్‌... ఇక డోంట్ వర్రీ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

వాట్సాప్ వినియోగ‌దారుల‌కు గ్రూపులతో త‌ల‌నొప్పి మామూలుగా ఉండ‌దు. మ‌న నెంబ‌రును ఎవ‌రెవ‌రో ఏవేవో గ్రూపుల్లో క‌లిపేస్తుంటారు. మ‌న ఇష్టంతో ప‌నిలేకుండానే మ‌నం వివిధ గ్రూపుల్లో యాడ్ అవుతుంటాం. అప్ప‌టి నుంచి ఆ గ్రూపులోని ప‌నికిరాని మెసేజ్‌లు అన్నింటినీ మనం భ‌రించాలి. గుడ్ మార్నింగ్‌, గుడ్ నైట్ మెసేజ్‌‌లు స‌హా అనేక ఇమేజెస్ కారణంగా ఫోన్ మెమొరీ త‌గ్గిపోవ‌డం, మ‌న‌కు త‌ల‌పోటు పెరిగిపోవ‌డం కామ‌న్‌. గ్రూప్‌ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేద్దామంటే వారు ఏమ‌నుకుంటారో అనే మొహ‌మాటం ఉంటుంది.

దీంతో ఇప్పుడు ఈ గ్రూపుల బాధ నుంచి రిలీఫ్ ఇవ్వ‌డానికి వాట్సాప్ కొత్త ఫీచ‌ర్ ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఈ ఫీచ‌ర్ ద్వారా ఇక గ్రూపుల్లో ఎవ‌రు ప‌డితే వారు మ‌న‌ల్ని యాడ్ చేయ‌లేదు. మ‌నం మ‌న‌కు ఇష్ట‌మున్న గ్రూప్‌ లోనే యాడ్ అయ్యే స‌దుపాయాన్ని వాట్సాప్ తీసుకువ‌చ్చింది.

ఇందుకోసం మ‌నం చేయాల్సింద‌ల్లా సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రైవ‌సీలో ఉన్న గ్రూప్స్ లోకి వెళ్లాలి. "హూ కాన్ యాడ్ మీ టూ గ్రూప్స్ " అనే ఆప్ష‌న్ లోకి వెళ్లాలి. అందులో నో బ‌డి అనే ఆప్ష‌న్ సెలెక్ట్ చేసుకుంటే గ్రూప్ ల‌లో మ‌న‌ల్ని ఎవ‌రూ యాడ్ చేయ‌లేరు. ఎవ‌రైనా యాడ్ చేయాల‌నుకుంటే ముందుగా మ‌న‌కు ఒక ఇన్విటేష‌న్ వ‌స్తుంది. దానికి అంగీక‌రిస్తేనే యాడ్ చేయ‌గ‌ల‌రు.

ఇక‌, ఇందులో మై కాంటాక్ట్స్ అనే ఆప్ష‌న్ కూడా ఉంటుంది. దీనిని సెల‌క్ట్ చేసుకుంటే కేవ‌లం మ‌న కాంటాక్ట్స్ లిస్ట్‌లో ఉన్న వారే మ‌న‌ల్ని గ్రూప్‌ల‌లోకి యాడ్ చేయ‌వ‌చ్చు. ఎవ్రీ వ‌న్ అనే ఆప్ష‌న్‌ను సెల‌క్ట్ చేసుకుంటే మాత్రం ఎవ‌రైనా మ‌న‌ల్ని యాడ్ చేయ‌వ‌చ్చు. ఇప్ప‌టికే వాట్సాప్ బిజినెస్ వినియోగ‌దారుల‌కు ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. తాజాగా వాట్సాప్ బీటా వ‌ర్ష‌న్ వాడుతున్న వినియోగ‌దారుల‌కు ఈ సౌక‌ర్యం అందుబాటులోకి తీసుకువ‌చ్చింది వాట్సాప్ సంస్థ‌. త్వ‌ర‌లో అంద‌రికీ అందుబాటులోకి రానుంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle