newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వాట్సాప్‌లో ఈ ట్రిక్‌లు.. సూపర్‌ ఉన్నాయ్‌.. ట్రై చేస్తారా!

27-09-201927-09-2019 06:37:33 IST
Updated On 27-09-2019 16:04:32 ISTUpdated On 27-09-20192019-09-27T01:07:33.368Z27-09-2019 2019-09-27T01:07:23.320Z - 2019-09-27T10:34:32.214Z - 27-09-2019

వాట్సాప్‌లో ఈ ట్రిక్‌లు.. సూపర్‌ ఉన్నాయ్‌.. ట్రై చేస్తారా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వాట్సాప్‌ని అందరూ వాడేస్తున్నారు.. మీరూ వాడేస్తుంటారు. కానీ అందులో కిటుకులు తెలుసుకొని వెరైటీగా వాడితే ఇంకా బాగుంటుంది కదా. అలాంటి కిటుకులు తెలుసుకొని మీ స్నేహితులకు చెబితే.. ‘మా వాడు టెక్నాలజీ స్పెషలిస్ట్‌’ అని అంటారు కదా. అందుకే వాట్సాప్‌లో కొన్ని ట్రిక్స్‌ మీకు అందిస్తున్నాం. ఓసారి ట్రై చేయండి.. మీ స్నేహితులకు షేర్‌ చేయండి. 

మొబైల్‌లో నెంబరు సేవ్‌ చేయక్కర్లేదు... 

వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్‌ పంపాలంటే వాళ్ల నెంబరు మీ మొబైల్‌లో కచ్చితంగా ఉండాల్సిందే. దీంతో ప్రతిసారి కొత్త నెంబరును మొబైల్‌ కాంటాక్ట్స్‌లో యాడ్‌ చేసుకొని... సింక్‌ అయ్యాక వాళ్లకు వాట్సాప్‌ చేస్తుంటారు. అలా సేవ్‌ చేయకుండా కూడా వాట్సాప్‌ చేయొచ్చు. దీని కోసం మీ మొబైల్‌/సిస్టమ్‌ బ్రౌజర్‌లో  https://api.whatsapp.com/send?phone=91XXXXXXXXXX లింక్‌ను (Xల స్థానంలో మీరు వాట్సాప్‌ చేయాలనుకుంటున్న వారి ఫోన్‌ నంబర్‌ ఇవ్వాలి. ) ఉపయోగించి వాట్సాప్‌ చేయొచ్చు. ఆగండి మిగతా ఫీచర్లు కూడా చదివి అన్నీ ఒకసారి ట్రై చేయండి. 

గ్రూపుల గోల లేకుండా... 

కాలేజ్‌ కింగ్స్‌, కాలనీ కుర్రాళ్లు, డిగ్రీ దోస్త్‌లు... వామ్మో మీ మొబైల్‌లోనూ ఇలాంటి గ్రూపులు చాలా ఉంటాయి. వాటిలో మీకు తెలియకుండానే మీరు యాడ్‌ అయిపోతుంటారు. ఒకసారి యాడ్‌ అయ్యాక వెళ్లిపోతే ఎవరు బాధపడతారో అని ఎగ్జిట్‌ అవ్వరు. ఈ బాధ లేకుండా ఉండాలంటే.. మిమ్మల్ని ఏదైనా గ్రూపులో యాడ్‌ చేయాలంటే మీ అనుమతి తీసుకుంటే సరిపోతుంది. ఈ పని మీరే చేసుకోవచ్చు. సెట్టింగ్స్‌ > అకౌంట్స్‌ > ప్రైవసీ > గ్రూప్స్‌ ఆప్షన్‌లోకి వెళ్లండి. అక్కడ ఎవ్రీ వన్‌, మై కాంటాక్ట్స్‌, నో బడీ అని ఆప్షన్లు ఉంటాయి. నో బడీ అనే ఆప్షన్‌ పెట్టుకుంటే మీ అనుమతి లేకుండా ఎవరూ మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్‌ చేయలేరు. 

గ్యాలరీ మొత్తం ఇవేనా... 

మీరెప్పుడో వారం క్రితం తీసుకున్న ఫొటోలను చూద్దామని గ్యాలరీ ఓపెన్‌ చేస్తే మొత్తం వాట్సాప్‌ ఫొటోలే కనిపిస్తున్నాయా? ఈ ఇబ్బంది లేకుండా వాట్సాప్‌ ఫొటోలు గ్యాలరీ యాప్‌లో కనిపించకుండా చేయొచ్చు.  దీని కోసం సెట్టింగ్స్‌ > చాట్స్‌> మీడియా విజిబిలిటీ ఆప్షన్‌లోకి వెళ్లి ఆప్షన్‌ను డిజేబుల్‌ చేయాలి. అప్పుడు వాట్సాప్‌లో వచ్చిన ఫొటోలు/ వీడియోలు మీ ఫోన్ గ్యాలరీలో కనిపించవు. మీరూ ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా... మార్చేయండి ఇంకేం. 

నోట్‌ప్యాడ్‌ కూడా...

వాట్సాప్‌ను ఛాటింగ్‌ కోసమే వాడాలా ఏంటి... అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే వాట్సాప్‌ను నోట్స్‌ యాప్‌గానూ వాడొచ్చు. ఏదైనా ముఖ్యమైన విషయం గుర్తొస్తే అందులో రాసేయొచ్చు. దీని కోసం మీరు వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేయాలి. ఆ తర్వాత ఒక మెంబర్‌ను యాడ్‌ చేసి... ఆ వెంటనే తొలగించేయాలి. ఆ తర్వాత మీరు ఆ గ్రూపులో పంపించే మెసేజ్‌లు, ఫొటోలు, లింక్‌లు అన్నీ మీకు మాత్రమే కనిపిస్తాయి. అలా వాట్సాప్‌ మీ ఇన్ఫర్మేషన్ స్టోరేజీగా మారిపోతుంది.  ఈ వార్త లింక్‌ను కూడా అక్కడే నోట్‌ చేసేసుకోండి మరి. 

వీడియో కన్వర్టర్‌గా...

మీ మొబైల్‌లో వాట్సాప్‌ ఉంటే  వీడియోలను జిఫ్‌లుగా కన్వర్ట్‌ చేయడానికి...  సాఫ్ట్‌వేర్లు, ఆన్‌లైన్‌ కన్వర్టర్లు అక్కర్లేదు. వీడియోలు, ఫొటోలు వాట్సాప్‌లో పంపే  తరహాలోనే జిఫ్‌లు తయారు చేయొచ్చు. దీని కోసం మొబైల్‌లో జిఫ్‌ ఎవరికి పంపాలనుకుంటున్నారో వారికి చిన్న వీడియో క్లిప్‌ షేర్‌ చేయాలి. సెండ్‌ బటన్‌ క్లిక్‌ చేసేముందు రైట్‌ సైడ్‌ టాప్‌లో చూస్తే వీడియో సింబల్‌/ జిఫ్‌లో ఆప్షన్‌ మార్చుకోవాలి. అక్కడ డీఫాల్ట్‌గా వీడియో ఆన్‌ అయి ఉంటుంది. దాన్ని జిఫ్‌గా మార్చుకుంటే మీరు పంపుతున్న వీడియో జిఫ్‌ రూపంలో అవతలి వ్యక్తికి వెళ్లిపోతుంది. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle