వాట్సాప్‌తో తస్మాత్ జాగ్రత్త!
20-11-201820-11-2018 18:09:09 IST
Updated On 20-11-2018 18:09:06 ISTUpdated On 20-11-20182018-11-20T12:39:09.739Z20-11-2018 2018-11-20T12:39:06.989Z - 2018-11-20T12:39:06.992Z - 20-11-2018

సోషల్ మీడియాలో ఈమధ్య అశ్లీలత ఎంత పెరిగిందో అందరికీ తెలుసు! సమాచార అనుసంధానం కోసం వినియోగించుకోవాల్సిన సామాజిక మాధ్యమాల్లో ఆకతాయిల ఆగడాలు ఎక్కువైపోయాయి. అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేయడం, అశ్లీల ఫోటోలు అప్లోడ్ చేయడం, మార్ఫింగ్ వంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారు. రోజురోజుకీ ఈ దురాగతాలకు అడ్డూఅదుపూ లేకుండా పోవడంతో... సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. నిబంధనల్ని అతిక్రమించి ఎవరైనా వ్యవహరిస్తే... వారి అకౌంట్‌ని శాశ్వతంగా బ్యాన్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇన్స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ కూడా అలాంటి రూల్స్‌ని అమలులోకి తీసుకొచ్చింది. మనకు ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ అందించే ఈ వాట్సాప్ రూల్స్‌ని అతిక్రమిస్తే... అంతే కఠినంగా వ్యవహరించేందుకు రెడీ అయ్యింది. ఆ రూల్స్ ఏమిటంటే...
* మన నెంబర్ని అనేకమంది బ్లాక్ చేసినా, రిపోర్ట్ చేసినా... వాట్సాప్ వెంటనే బ్యాన్ చేస్తుంది. కాబట్టి... ఎక్కువసార్లు బ్లాక్ అవ్వకుండా ఉండేలా చూసుకోవాలి.
* ఇతర వినియోగదారుకు వైరస్, మాల్వేర్లను పంపించడం వాట్సాప్‌లో నిషేధించబడింది. వాటిని ఎవరికైనా పంపితే... వాట్సాప్ వెంటనే బ్యాన్ చేసే అవకాశం ఉంది.
* వాట్సాప్ నుంచి ఇతర వినియోగదారుల గురించి సమాచారాన్ని సేకరించడం చట్టవిరుద్ధం! కాబట్టి... వాట్సాప్ సర్వర్లు హాక్ చేయడానికి ప్రయత్నిస్తే, అకౌంట్‌ను కోల్పోతారు.
* వాట్సాప్ అకౌంట్ ఉండి కూడా వాట్సాప్ ప్లస్ వినియోగిస్తే... మీ అకౌంట్ బ్యాన్ అవ్వడం పక్కా! ఎందుకంటే... ఈ వాట్సాప్ ప్లస్ అప్లికేషన్‌ను ‘వాట్సాప్’ డెవలప్ చేయలేదు. ఈ రెండింటికి సంబంధం లేదు.
* ఎవరైనా చట్టవిరుద్ధ కంటెంట్ పంపిస్తుంటే... ఆ కాంటాక్ట్ లేదా గ్రూప్‌పై ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ అనుమతిస్తుంది. అలాంటి ఫిర్యాదులు అందుకున్న అకౌంట్‌ని వాట్సాప్ డీ-యాక్టివేట్ చేస్తుంది.
* వాట్సాప్ కోడ్‌ను మాడిఫై చేయడానికి ప్రయత్నిస్తే, అకౌంట్‌ను కోల్పోతారు.
* వాట్సాప్ నియమాల ప్రకారం బల్క్-మెసేజింగ్, ఆటో-మెసేజింగ్, ఆటో-డయలింగ్ వంటి చట్టవిరుద్ధ లేదా ఆమోదయోగ్యమైన సమాచారాలను పంపడం నిషేధించబడింది. అందువల్ల ఇలాంటి మెసేజీలు పంపితే వాట్సాప్ మీ అకౌంట్‌ని బ్యాన్ చేస్తుంది.
* ఇతరుల పేరుతో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేస్తే అకౌంట్ బ్యాన్ అవుతుంది.
* తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నట్లు వాట్సాప్ గుర్తిస్తే... వెంటనే అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది.
* చట్టవిరుద్ధమైన, అశ్లీలమైన, అపవాదు, బెదిరింపు, భయపెట్టడం, వేధించడం, ద్వేషపూరిత, జాతిపరంగా అప్రియమైన మెసేజీలను పంపడానికి ప్రయత్నిస్తే... వాట్సాప్ మీ అకౌంట్‌ని బ్యాన్ చేసేస్తుంది.

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021
ఇంకా