వాట్సప్ పేరు మారిపోయింది? కానీ...?
20-08-201920-08-2019 16:35:34 IST
2019-08-20T11:05:34.148Z20-08-2019 2019-08-20T11:05:31.797Z - - 17-04-2021

వాట్సప్ పేరు వినకుండా, వాట్సప్ చూడకుండా క్షణం కూడా నేటితరానికి గడవడం లేదు. ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ మారిపోతోంది. ఇప్పటి వరకు కేవలం వాట్సాప్గానే పరిగణిస్తున్న ఈ యాప్ ఇకపై ‘వాట్సాప్ బై ఫేస్బుక్’ అని యూజర్లకు కనిపించనుంది. ప్రస్తుతం బీటా యూజర్లకు ఇది దర్శనమిస్తుండగా.. త్వరలో అందరికీ ఇదే పేరుతో కనిపించనుంది. పేరులో మార్పు తప్ప.. యాప్‌లో మరే ఇతర మార్పూలు ఇప్పట్లో కనిపించకపోవచ్చు. 2012లో ఇన్‌స్టాను, 2014లో వాట్సాప్‌ను ఫేస్బుక్ కొనుగోలు చేసినప్పటికీ అవి ఆయా పేర్లతోనే ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. ఇటీవలే పేరు మార్చాలని ఫేస్బుక్ నిర్ణయించడంతో అది ఇప్పుడు అమలులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ బై ఫేస్బుక్, వాట్సాప్ బై ఫేస్బుక్ అని మారుస్తున్నట్లు పేర్కొంది. అందుకనుగుణంగానే వాట్సాప్‌లో తాజా మార్పు చోటుచేసుకుంది. బీటా యూజర్లు వాట్సాప్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళితే..‘వాట్సాప్ బై ఫేస్బుక్’ అని కనిపిస్తుంది. భవిష్యత్‌లో కీలక మార్పులకు ఫేస్బుక్ ఈ విధంగా శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఫేస్బుక్ మెసెంజర్ ఉపయోగించే వ్యక్తి.. వాట్సాప్ ఖాతా మాత్రమే కలిగిన వ్యక్తితోనూ నేరుగా చాట్ చేసే అవకాశం ఉంది. 2020 నాటికి ఇంటిగ్రేషన్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. ఇటీవలే యూజర్ల సెక్యూరిటీ కోసం ఫింగర్‌ప్రింట్ లాక్ సదుపాయం వాట్సాప్ తీసుకొచ్చింది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా