వాట్సప్ గ్రూప్ పట్టు.. మెసేజ్ పెట్టు
27-03-201927-03-2019 17:48:34 IST
2019-03-27T12:18:34.462Z27-03-2019 2019-03-27T12:18:28.341Z - - 10-04-2021

లోక్‌సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని సోషల్ మీడియాలో ముమ్మరం చేశాయి. ఓటర్లను ప్రభావితం చేసేందుకు దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 90వేల వరకూ వాట్సాప్ గ్రూపులు పని చేస్తున్నాయని అంచనా. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల నిపుణులు చెబుతున్నారు. మీరు ఎవరికి ఓటెయ్యాలో, ఎవరిని గెలిపించాలో, ఎందుకు గెలిపించాలో వాట్సప్ సందేశాలు మీ ఫోన్లకు హోరెత్తనున్నాయి. దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో వివిధ రాజకీయ పార్టీలు వాట్సప్ గ్రూపులను ప్రోత్సహిస్తున్నాయి. తమ కార్యకర్తలు, సాంకేతిక నిపుణుల ద్వారా సందేశాలు పోస్ట్ అవుతున్నాయి. తమ ప్రచారం కోసం రాజకీయపార్టీలు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడంలేదనడానికి ఈవాట్సప్ గ్రూపులే నిదర్శనం. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జోరుగా క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్‌తో పాటు వాట్సప్‌లలో ఓటర్లకు రాజకీయ సందేశాలు పంపుతున్నారు. క్షణం కూడా తీరిక లేకుండా సందేశాలు బట్వాడా అవుతున్నాయి. దాదాపు 2 కోట్ల 50 లక్షల మందికి పైగా యూజర్లకు నేరుగా సమాచారాన్ని అందిస్తాయని తెలుస్తోంది. సోషల్ మీడియా ప్రచారంలో ఇప్పటి వరకు ముందున్న ఫేస్‌బుక్‌కు వాట్సప్ షాకిచ్చింది. దీనిని బట్టి చూస్తే వాట్సప్ హవా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రూపులలో ఒక్కొక్కరు ఐదుగురికి మెసేజ్‌లు పంపడం ద్వారా కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేయగలరు. అది ఫేక్ న్యూస్ అయినా ఒరిజినల్ అయినా భారీ స్థాయిలో అది ట్రోల్ అవుతున్నట్లు దీని ప్రకారం తెలుస్తోంది. నిజమయిన, నిక్కచ్చి అయిన సమాచారం అందేందుకు వాట్సప్ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. తప్పుడు సమాచారాన్ని,కల్పిత వార్తలను అడ్డుకోవడానికి లక్ష మందికి శిక్షణ ఇచ్చి నియమించుకోవడం విశేషం. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో నైతిక నియమావళిని పాటిస్తోంది. మొత్తం ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో టెక్నాలజీ వినియోగం.. మూడు ఫేస్ బుక్ అకౌంట్లు.. ఆరు వాట్సప్ గ్రూపులుగా కొనసాగుతోంది.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
2 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా