వాట్సప్ ఇక మీ అదుపులో.. వచ్చేసింది ఫింగర్ ప్రింట్ సెన్సార్
18-08-201918-08-2019 09:13:59 IST
2019-08-18T03:43:59.731Z18-08-2019 2019-08-18T03:43:53.582Z - - 11-04-2021

వాట్సప్ సందేశాలు లేకుండా రోజు గడవడం లేదు. అయితే వాట్సప్ అంత సురక్షితం కాదనే భయం వేధిస్తోంది. ఇక ఇలాంటి సందేహాలు మీకు అక్కర్లేదు. వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చి చేరింది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను యాడ్ చేసింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అథంటికేషన్ ఫీచర్. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్‌పై పరీక్షల అనంతరం ఆండ్రాయిడ్ బీటా యూజర్ల కోసం దీన్ని రిలీజ్ చేసింది. వాట్సాప్ అకౌంట్‌ను ఇతరులు చూడకుండా...లేదా వాడకుండా ఉండేందుకు ఈ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్ ఉపయోగపడుతుందని వాట్సప్ సంస్థ చెబుతోంది. అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్లో ఫేస్ రిగక్నైజేషన్ అందుబాటులో లేదు. స్టేబుల్ వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందనే దానిపై కంపెనీ వివరణ ఇవ్వడంలేదు. ఐఫోన్ యూజర్లకు ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఐ ఫోన్ యూజర్లు.టచ్ ఐడీ, ఫేషియల్ రిగక్నైజేషన్ ఫీచర్ల ద్వారా కూడా వాట్సాప్ అన్ లాక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో కంపెనీ వివరించింది.. వాట్సాప్ అకౌంట్ లాగిన్ అయి, సెట్టింగ్స్ ఆప్షన్ దగ్గర అకౌంట్ పై క్లిక్ చేయవచ్చు. అనంతరం ప్రైవసీ ఆప్షన్ పై క్లిక్ చేసి యూస్ ఫింగర్ ఫ్రింట్ టు అన్‌లాక్ అప్షన్‌పై ప్రెస్ చేయాలి. దీంతో మీరు ఫింగర్ ప్రింట్ ఇస్తే యాక్టివేట్ అవుతుంది.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
13 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా